ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ లాంగ్ వీకెండ్ లో రికార్డుల భీభత్సం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie), వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసింది. కొన్ని చోట్ల డ్రాప్స్ కొంచం ఎక్కువగా ఉన్నా కూడా…
హిందీలో సినిమా హోల్డ్ చేసిన తీరు నెక్స్ట్ లెవల్ లో ఊచకోత కోసింది. దాంతో ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్బ్ హోల్డ్ తో వర్కింగ్ డే టెస్ట్ లో దుమ్ము లేపింది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున ఓవరాల్ గా 8-9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే…
మొత్తం మీద 9.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 38.37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ హోల్డ్ ని చూపించగా గ్రాస్ పరంగా అనుకున్నట్లే 85.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా…
ఓవరాల్ గా సినిమా 5 రోజుల్లో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Pushpa 2 The Rule 5 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 66.27Cr
👉Ceeded: 23.36Cr
👉UA: 16.08Cr
👉East: 9.10Cr
👉West: 7.20Cr
👉Guntur: 11.69Cr
👉Krishna: 9.40Cr
👉Nellore: 5.44Cr
AP-TG Total:- 148.54CR(215.95CR~ Gross)
👉KA: 33.35Cr
👉Tamilnadu: 21.80Cr
👉Kerala: 6.20Cr
👉Hindi+ROI : 160.05Cr
👉OS – 78.35Cr***Approx
Total WW Collections : 448.29CR(Gross- 885.25CR~)
(72%~ Recovery)
మొత్తం మీద 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 171.71 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది. సినిమా ఆల్ రెడీ 72% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.