సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, రిలీజ్ అయిన 6 రోజుల్లో ఆల్ మోస్ట్ 960 కోట్ల రేంజ్ లో మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది…
ఇండియన్ సినిమా హిస్టరీలో ఫాస్టెస్ట్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా 2024 ఇయర్ కి గాను రిలీజ్ అయిన అన్ని సినిమాల రికార్డులను మొదటి వారంలోనే బ్రేక్ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ ఉంది. ఈ క్రమంలో సినిమా మరో అడుగు ముందుకు వేసి ఈ ఇయర్ రిలీజ్ అయిన…
ఇండియన్ మూవీస్ ఎపిక్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో ఊహకందని రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీ అయిన స్త్రీ2(Stree2 Movie) టోటల్ రన్ గ్రాస్ ను క్రాస్ చేసింది…ఈ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 870 కోట్ల రేంజ్ లో మమ్మోత్ గ్రాస్ ను…
ఆల్ మోస్ట్ 60 రోజుల పాటు థియేట్రికల్ రన్ లో సొంతం చేసుకోగా…ఇప్పుడు పుష్ప2 మూవీ మాత్రం కేవలం 5 రోజుల కలెక్షన్స్ తోనే ఈ రికార్డ్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి ఈ ఏడాది ఇండియన్ మూవీస్ పరంగా టాప్ 2 బిగ్గెస్ట్ గ్రాస్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది…
ఇక టాప్ ప్లేస్ లో ఉన్న కల్కి (Kalki 2898 AD) సినిమా టోటల్ రన్ లో సాధించిన 1061 కోట్ల రేంజ్ గ్రాస్ అతి త్వరలో బ్రేక్ చేయబోతున్న ఈ సినిమా ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ రన్ లో ఏ రేంజ్ లో బెంచ్ మార్క్ లను సెట్ చేస్తుందో చూడాలి ఇప్పుడు….