ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, మొదటి వారంలోనే అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా, హిందీలో ఆల్ టైం ఎపిక్ రికార్డులను నమోదు చేస్తున్న ఈ సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా కొంచం కష్టపడాల్సిన అవసరం ఉండగా ఉన్నంతలో నైజాంలో సీడెడ్ లో సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సాలిడ్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా నైజాం ఏరియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో…
లాంగ్ రన్ లో రికార్డుల జాతర సృష్టించడానికి సిద్ధం అవుతూ ఉండగా, ఓవరాల్ గా నైజాంలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒక్కో సినిమా రికార్డ్ ను బ్రేక్ చేస్తూ దుమ్ము లేపుతుంది…5వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇక్కడ…
ఆల్ రెడీ దేవర(Devara Movie) టోటల్ కలెక్షన్స్ ని క్రాస్ చేసిన పుష్ప2 మూవీ ఇప్పుడు 6వ రోజు సాధించిన కలెక్షన్స్ ఇండియన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ అయిన బాహుబలి2 టోటల్ నైజాం కలెక్షన్స్ ని క్రాస్ చేసింది….టోటల్ రన్ లో బాహుబలి2 మూవీ 68 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా ఇప్పుడు 6వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 70 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దాటేసిన పుష్ప2 మూవీ మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది….ఇక నైజాంలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ లో…
టాప్ 4 ప్లేస్ కి 6 వ రోజు కలెక్షన్స్ తోనే ఎంటర్ అయిన సినిమా ఇక మిగిలిన రన్ లో ఆర్ ఆర్ ఆర్, కల్కి మరియు సాలార్ సినిమాల కలెక్షన్స్ ని టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఎన్ని రోజుల్లో నైజాంలో టాప్ ప్లేస్ ని పుష్ప2 టార్గెట్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.