నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు…బాక్ టు బాక్ హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండగా లాస్ట్ ఇయర్ చేసిన భగవంత్ కేసరి సినిమాతో కెరీర్ లో హట్రిక్ హిట్స్ అండ్ హాట్రిక్…
70 కోట్ల షేర్ మార్క్ మూవీస్ ని కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేశాడు….ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా సంక్రాంతికి భారీ పోటిలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉన్నప్పటికీ బిజినెస్ పరంగా…
మంచి జోరుని చూపెడుతూ బాలయ్య ప్రజెంట్ ఫామ్ దృశ్యా ఎక్కడా తగ్గడం లేదు…ఓవర్సీస్ మార్కెట్ విషయంలో ఒకప్పుడు బాలయ్య కొంచం వీక్ గా ఉండేవారు..కానీ ఇప్పుడు హాట్రిక్ విజయాలతో దుమ్ము లేపుతూ ఉండటంతో డాకు మహారాజ్ కి సాలిడ్ బిజినెస్ ఆఫర్స్ అన్ని చోట్ల నుండి…
వస్తూ ఉండగా ఇప్పుడు ఓవర్సీస్ లో సైతం సాలిడ్ రేటుని ఈ సినిమా సొంతం చేసుకుంది. బాలయ్య ప్రీవియస్ మూవీ భగవంత్ కేసరి సినిమాకి 6 కోట్ల రేంజ్ రేటు బిజినెస్ జరిగింది ఓవర్సీస్ లో…ఇప్పుడు ఈ బిజినెస్ మొత్తం నార్త్ అమెరికాకే సొంతం చేసుకుంది డాకు మహారాజ్ సినిమా…
టోటల్ ఓవర్సీస్ బిజినెస్ వాల్యూ 8 కోట్లకు పైగా ఉంటుదని అంచనా…భగవంత్ కేసరి సినిమా టోటల్ రన్ లో ఓవర్సీస్ లో 7.35 కోట్ల షేర్ ని అందుకుంది…సంక్రాంతికి పోటిలో సొంతం చేసుకున్న డాకు మహారాజ్ సినిమా టోటల్ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇప్పుడు 2.3-2.4 మిలియన్ డాలర్స్ రేంజ్ లో ఓవరాల్ గా…
గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సినిమా కి పోటిలో ఇతర క్రేజీ సినిమాలు కూడా గ్రాండ్ గానే రిలీజ్ కానున్న నేపధ్యంలో డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య ఎంతవరకు అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాడో చూడాలి.