బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి బిగ్గెస్ట్ మూవీస్ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తూ మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie) వరల్డ్ వైడ్ గా ఆల్ రెడీ ఎపిక్ రికార్డులను నమోదు చేయగా…
తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చే సరికి ఇక్కడ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్నా కూడా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రేంజ్ లో రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో లేక పోయినా వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ నే అందుకుందని చెప్పాలి ఇప్పుడు…ఇక మొదటి వారంలోనే సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 162 కోట్ల లోపు షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేస్తూ ఉండగా ఇప్పుడు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన…
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దేవర(Devara Movie) టోటల్ రన్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని 8 రోజుల్లో బ్రేక్ చేసింది….దేవర మూవీ తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రన్ లో 162.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది…
ఇప్పుడు 8వ రోజు సాధించిన కలెక్షన్స్ తో దేవర టోటల్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 4 ప్లేస్ లో నిలిచింది…ఇక మిగిలిన రన్ లో సినిమాకి…
కల్కి మరియు బాహుబలి2 సినిమాలను దాటే అవకాశం ఉంది, అదే టైంలో టాలీవుడ్లో 200 కోట్ల షేర్ ని అందుకున్న ఆర్ ఆర్ ఆర్ మరియు బాహుబలి2 ల సరసన నిలవడానికి అవకాశం ఎంతైనా ఉన్నప్పటికీ ఆర్ ఆర్ ఆర్ ను అందుకోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి సినిమా లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.