ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 252 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1110 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
ఇక సినిమా 10వ రోజున అన్ని చోట్లా 9వ రోజు మీద సాలిడ్ జోరుని చూపించి కుమ్మేసింది సినిమా…తెలుగు రాష్ట్రాల్లో సినిమా 10వ రోజున ఇప్పుడు 10-11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి 9-10 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, ఇక హిందీలో సినిమా మాస్ రాంపెజ్ మరో లెవల్ లో ఉండగా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో కుమ్మేసిన సినిమా అక్కడ 10వ రోజున ఇప్పుడు…
42-43 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ గానే జోరు చూపిస్తున్న సినిమా ఇప్పుడు 10వ రోజున వరల్డ్ వైడ్ గా 68-70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు హిందీలో ఫైనల్ గా…
చూపించే జోరుని బట్టి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా 10వ రోజు కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో 263 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, వరల్డ్ వైడ్ గా మమ్మోత్ 1180 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. ఇక అఫీషియల్ 10 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.