Home న్యూస్ 10 డేస్ లో జవాన్ ఔట్…పుష్ప2 దెబ్బకి రికార్డులు చెల్లాచెదురు!!

10 డేస్ లో జవాన్ ఔట్…పుష్ప2 దెబ్బకి రికార్డులు చెల్లాచెదురు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేయడమే ధ్యేయంగా దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ అన్ని చోట్లా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా హిందీ, తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక మరియు ఓవర్సీస్ లో మాస్ జోరు ని చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం…

కాగా సినిమా హిందీలో బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ కలెక్షన్స్ ని సైతం బ్రేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తూ ఉండగా ఇప్పుడు ఇండియన్ మూవీస్ పరంగా వరల్డ్ వైడ్ గా ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో కూడా ఒక్కో సినిమాను దాటేస్తూ దూసుకు పోతుంది…

ఈ క్రమంలో సినిమా ఇప్పుడు బాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్(Jawan Movie) టోటల్ రన్ కలెక్షన్స్ ని జస్ట్ 10 రోజుల్లో బ్రేక్ చేసి సంచలన రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది…. షారుఖ్ ఖాన్ కెరీర్ లో…

ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసిన జవాన్ మూవీ టోటల్ రన్ లో 1160 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు కేవలం 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…. ఏకంగా 1195 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…దాంతో సినిమా బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ అలాగే ఇండియన్ మూవీస్ లో ఎపిక్ రికార్డ్ మూవీస్ ని ఒక్కటిగా బ్రేక్ చేస్తూ ఉండగా త్వరలోనే కేజిఎఫ్ చాప్టర్2 అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమాల రికార్డు కలెక్షన్స్ ని అవలీలగా అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. మిగిలిన రన్ లో సినిమా ఏ రేంజ్ లో భీభత్సం సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here