బాక్స్ ఆఫీస్ దగ్గర 617 కోట్ల మమ్మోత్ రికార్డ్ బిజినెస్ ను సొంతం చేసుకుని 620 కోట్ల రేంజ్ హిస్టారికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule) మూవీ అన్ని చోట్లా ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోయగా మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఇప్పుడు…
రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైంకే సొంతం చేసుకుని రికార్డు భీభత్సం సృష్టించింది. 11వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊహకందని రాంపెజ్ ను చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ రికార్డ్ డే 11 కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఏకంగా…
12.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కూడా హిందీ లో చూపించిన మాస్ జోరు వలన ఏకంగా 48.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా గ్రాస్ ఏకంగా 105.50 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను 11వ రోజున సొంతం చేసుకుని రికార్డుల జాతర సృష్టించింది…
దాంతో సినిమా ఇప్పుడు మొత్తం మీద 11 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 11 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 87.06Cr
👉Ceeded: 28.81Cr
👉UA: 21.56Cr
👉East: 11.55Cr
👉West: 9.01Cr
👉Guntur: 14.21Cr
👉Krishna: 11.64Cr
👉Nellore: 6.99Cr
AP-TG Total:- 190.83CR(282.60CR~ Gross)
👉KA: 45.55Cr
👉Tamilnadu: 29.65Cr
👉Kerala: 7.20Cr
👉Hindi+ROI : 266.35Cr
👉OS – 99.90Cr***Approx
Total WW Collections : 639.48CR(Gross- 1301.40CR~)
మొత్తం మీద అన్ని రికార్డుల బెండు తీసిన పుష్ప2 మూవీ 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పుడు ఏకంగా 19.48 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇదే ఊపుని లాంగ్ రన్ లో కొనసాగిస్తే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాలలో కూడా ఒకటిగా నిలిచే అవకాశం ఉంటుంది.