రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా ఊహకందని కలెక్షన్స్ తో మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుని సంచలనం సృష్టించిన ఎపిక్ మాస్ హిట్ పుష్ప2(Pushpa2 Movie) ఇప్పుడు రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా అన్ని చోట్లా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…
మిగిలిన ఏరియాలు ఎలా ఉన్నా కూడా హిందీలో మాత్రం ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్స్ తగ్గగా డ్రాప్స్ ఉన్నప్పటికీ ఉన్నంతలో మంచి ఆక్యుపెన్సీతోనే పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి..
ఓవరాల్ గా సండే తో పోల్చితే ఆల్ మోస్ట్ 65-70% రేంజ్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ కనిపించగా ఆఫ్ లైన్ లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తే సినిమా ఓవరాల్ గా 4-4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, తమిళ్ అండ్ కేరళ కలిపి ఓవరాల్ గా 2-2.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక హిందీలో ట్రెండ్ స్టడీ గా ఉండగా లాస్ట్ శుక్రవారంతో పోల్చితే డ్రాప్స్ 30% రేంజ్ లోనే ఉండటంతో సినిమా…
హిందీలో 19-20 కోట్ల రేంజ్ నుండి ఆ పైన నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా మరోసారి డీసెంట్ హోల్డ్ ని సినిమా చూపించడంతో మొత్తం మీద 12వ రోజు వర్కింగ్ డే లో పుష్ప2 మూవీ 18-20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి షేర్ పెరిగే అవకాశం ఉంది. హిందీలో ఓవర్సీస్ లో ఫైనల్ హోల్డ్ బాగుంటే రచ్చ మరింత ఎక్కువగా చేయోచ్చు. ఓవరాల్ గా వర్కింగ్ డే లో సినిమా మరోసారి సాలిడ్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతుంది. ఇక టోటల్ గా 12రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.