హిస్టారికల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతున్న పుష్ప2(Pushpa2 Movie) ఇండియన్ మూవీస్ లో ఎపిక్ రికార్డులను నమోదు చేస్తూ ఉండగా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 282 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 1300 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది ఇప్పుడు…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున మరోసారి వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా మరోసారి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తోనే జోరు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజున ఇప్పుడు 6-6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి సినిమా 4.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీ లో మరోసారి మంచి జోరుని చూపెడుతున్న సినిమా 22-24 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా వర్కింగ్ డే లో…
మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండటంతో ఓవరాల్ గా 12వ రోజున వరల్డ్ వైడ్ గా 40-42 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ కలెక్షన్స్ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో…
12 రోజుల్లో ఓవరాల్ గా 288 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 1340-1345 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఓవరాల్ గా ఊహకందని రేంజ్ లో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేయబోతున్న ఈ సినిమా 12 రోజుల్లో అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.