వరల్డ్ వైడ్ గా బాక్స్ అఫీస్ దగ్గర హిందీలో సాధిస్తున్న కలెక్షన్స్ హెల్ప్ తో ఆల్ రెడీ బిగ్గెస్ట్ రికార్డుల బెండు తీసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పుష్ప2(Pushpa2 The Rule Movie) తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి జోరునే చూపిస్తున్నా కూడా హిందీ జోరు ముందు తెలుగు హోల్డ్…
చాలా తక్కువగా అనిపుస్తున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ రికార్డులతో ఊచకోత కోస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఆల్ టైం టైం టాప్ 3 బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మమ్మోత్ మూవీ కల్కి టోటల్ షేర్ ని దాటేసింది…..కల్కి మూవీ టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో…
187 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ షేర్ మార్క్ ని కేవలం 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో పుష్ప2 మూవీ బ్రేక్ చేసింది…. 190 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న సినిమా 12 రోజుల కలెక్షన్స్ తో 195 కోట్ల మార్క్ ని దాటేసి 200 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్…
దిశగా దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచింది….టాప్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉండగా రెండో ప్లేస్ లో ఎపిక్ బాహుబలి2 మూవీ నిలిచింది…బాహుబలి2 మూవీ ని అందుకోవాలి అంటే…
9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా అదే టైంలో ఆర్ ఆర్ ఆర్ ని అందుకోవాలి అంటే మాత్రం ఇంకా 77 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది. అది ప్రస్తుతానికి చాలా చాలా కష్టమే అని చెప్పాలి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ మాత్రం…
కన్ఫాం గా కనిపిస్తూ ఉండగా హిందీలో చూపించిన రేంజ్ రాంపెజ్ ను ఇక్కడ కూడా చూపించి ఉంటే ఆర్ ఆర్ ఆర్ కి దగ్గర అయ్యేది కానీ ఇప్పుడు అది కష్టంగానే కనిపిస్తుంది. అయినా కూడా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా అన్ని రికార్డుల బెండు తీసింది పుష్ప2 మూవీ.