సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ రికార్డుల బెండు తీస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) హిందీలో ఊహకందని హోల్డ్ ని చూపెడుతూ దుమ్ము లేపుతుంది. హిందీలో సినిమా హోల్డ్ మిగిలిన అన్ని చోట్లా…
కలెక్షన్స్ ని ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ ప్రతీ రోజూ కలెక్షన్స్ పరంగా అంచనాలను అన్నీ కూడా మించిపోతూ ఉండగా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ తో 12 రోజులు కంటిన్యూగా 20 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా సినిమా ఇప్పుడు 13వ రోజున…
సాధించిన కలెక్షన్స్ తో హిందీ లో ఎపిక్ 600 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఇండస్ట్రీ రికార్డ్ బెండు తీసింది. బాలీవుడ్ చరిత్రలోనే ఇది ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డ్ అని చెప్పాలి. ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు పుష్ప2 రిలీజ్ అవ్వాల్సిన రోజున వచ్చిన…
శ్రద్ధా కపూర్ లీడ్ రోల్ లో నటించిన సెన్సేషనల్ మూవీ స్త్రీ2 సినిమా ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకుని హిందీ వర్షన్ కింద 600 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న మొదటి సినిమాగా రికార్డ్ కొట్టింది. ఈ సినిమా సుమారు 39 రోజుల టైం తీసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర…
600 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది…యావరేజ్ గా రోజుకి సినిమా 15.40 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు పుష్ప2 మూవీ కేవలం 13 రోజుల టైంకే హిందీ లో 600 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది…యావరేజ్ గా రోజుకి ఈ సినిమా…
46.15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో హిస్టారికల్ రన్ ను కొనసాగిస్తుంది ఇప్పుడు. ఇక స్త్రీ2 మూవీ ఆల్ మోస్ట్ 50 రోజుల పాటు రన్ ని కొనసాగించింది. ఇప్పుడు పుష్ప2 మూవీ కూడా ఇదే రేంజ్ లో రన్ ని కొనసాగిస్తే ఊహకందని బెంచ్ మార్క్ ని హిందీలో నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది.