బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రికార్డులతో ఎపిక్ రన్ ను సొంతం చేసుకుంటూ రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) రెండో వారాన్ని ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…
కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా, మరోసారి వర్కింగ్ డే లో సినిమా మేజర్ ఏరియాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు దుమ్ము లేపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా ఈ రోజు 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని…
అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక తమిళ్ మరియు కేరళ కలిపి 1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక హిందీ లో సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టడీగా దూసుకు పోతూ ఈ రోజు 16-17 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా మరోసారి పర్వాలేదు అనిపిస్తూ ఉండగా ఇండియాలో అలాగే ఓవర్సీస్ లో సైతం సినిమా ఎక్కువగా హిందీ వర్షన్…
రిమార్కబుల్ ట్రెండ్ ను చూపిస్తూ ఉంది. ఇక సినిమా 14వ రోజున వరల్డ్ వైడ్ గా 11 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 2 వారాలకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.