బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు కామెడీ సినిమాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా దూసుకు పోయిన అల్లరి నరేష్(Allari Naresh) రీసెంట్ టైంలో సీరియస్ మూవీస్ ఎక్కువగా చేస్తూ ఉన్నా కూడా ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి(Bachhala Malli Movie Review) సినిమాతో వచ్చేశాడు…
మరి ఈ సినిమాతో ఎంతవరకు అంచనాలను అందుకున్నాడో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే చిన్నప్పుడే తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని కోపంతో ద్వేషం పగని పెంచుకున్న హీరో, చెడు అలవాట్లు చేసుకుని తన లైఫ్ ని నాశనం చేసుకుంటాడు…అలాంటి టైంలో హీరోయిన్ తన లైఫ్ లోకి ఎంటర్ అవ్వడంతో…
తిరిగి అన్నింటినీ మానేసి మంచి వాడిగా మారుతాడు, కానీ తన కోపం-మూర్ఖత్వం వలన పరిస్థితులు చేయి జారిపోతాయి….ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథ పాయింట్ చాలా రొటీన్ గానే అనిపించినా కూడా పూర్తిగా డైరెక్టర్….
అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్ మీదనే సినిమాను నడిపించాడు…కొన్ని సీన్స్ మినహా సినిమా అంతా అల్లరి నరేష్ కనిపిస్తాడు. తన నటన తన కెరీర్ లో టాప్ పెర్ఫార్మెన్స్ మూవీస్ లో ముందు నిలిచే రేంజ్ లో ఉంటుంది ఈ సినిమాలో…సీరియస్ రోల్ లో అంతలా మెప్పించాడు అల్లరోడు…
తన డైలాగ్స్, మాస్ సీన్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ అదుర్స్ అనిపించాయి…హీరోయిన్ అమృతా కూడా బాగా ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు. పాటలు ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ పర్వాలేదు అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పార్టు పార్టులుగా బాగున్నా కూడా లాగ్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది…
ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకోగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ నార్మల్ గానే ఉన్నా హీరో క్యారెక్టర్ వరకు ఫుల్ న్యాయం చేసినా కూడా టోటల్ మూవీ గా మాత్రం ఫుల్ మార్కులు పడలేదు….మూర్ఖత్వం ఓ రేంజ్ లో ఉన్న హీరో జస్ట్ హీరోయిన్ చెప్పింది అని మారిపోవడం…తన తండ్రి ని ద్వేషించడానికి చెప్పిన రీజన్స్…
అంత పవర్ ఫుల్ గా లేక పోవడం, తన తల్లి క్లైమాక్స్ లో చెప్పిన డైలాగ్స్ కి హీరో మారిపోయినా ముందే ఇది చేసి ఉంటే బాగుండేది కదా అని అనిపించడం…ఇలా సినిమాలో కొన్ని ఫ్లాస్ ఎక్కువే ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ కి…
మాస్ రగ్గుడ్ విలేజ్ నేటివిటీ కథతో వచ్చిన బచ్చల మల్లి హీరో క్యారెక్టర్ వలన పార్టు పార్టులుగా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది కానీ కొంచం లాగ్ ను బరించాల్సి ఉంటుంది..లెంత్ తగ్గించి మరింత టైట్ స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపి ఉంటే ఇంకొంచం బెటర్ గా ఉండేది….
మొత్తం మీద తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న అల్లరి నరేష్ కోసం ఒకసారి ట్రై చేయోచ్చు బచ్చల మల్లి సినిమాను….కానీ కొంచం ఓపిక అవసరం…ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…
Niku gu***lo nara lu untey UI review n rating evvara chudam🤣🤣🤣