ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) మూడో వారంలో ఎంటర్ అయ్యి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది. సినిమా 16వ రోజు తెలుగు హిందీలో కుమ్మేయగా 17వ రోజున అన్ని చోట్లా వీకెండ్ అడ్వాంటేజ్ తో మాస రచ్చ చేస్తుంది ఇప్పుడు…
16వ రోజు మీద సినిమా మాసివ్ గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు అన్నింటినీ డామినేట్ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే…
2.4-2.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా కర్ణాటక, తమిళ్ లో బెటర్ జోరుని చూపెడుతూ ఉండగా కేరళలో పెద్దగా ఇంపాక్ట్ లేదు…ఓవరాల్ గా ఈ మూడు చోట్ల కలిపి సినిమా…
1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీలో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న సినిమా అక్కడ రిమార్కబుల్ గ్రోత్ ని చూపించగా ఈ రోజు అక్కడ 18-20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే దిశగా దూసుకు పోతుంది, ఫైనల్ లెక్కలు…
అంచనాలను ఇంకా మించే అవకాశం కూడా ఉండగా ఓవర్సీస్ లో సినిమా పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 17వ రోజున 14.5-15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
షేర్ ఇంకా పెరిగి 16 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద సినిమా ఈ రోజు ఊరమాస్ రాంపెజ్ ను చూపించగా ఆదివారం కూడా మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా టోటల్ గా 17 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.