ఊరమాస్ హోల్డ్ ని మూడో వీక్ లో కూడా చూపెడుతూ అన్ని చోట్లా దిమ్మతిరిగే కలెక్షన్స్ తో రచ్చ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1449 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17వ రోజున శనివారం అడ్వాంటేజ్ అన్ని చోట్లా కుమ్మేసింది కానీ మేజర్ కలెక్షన్స్ అన్నీ కూడా హిందీ నుండే రావడం విశేషం….తెలుగు రాష్ట్రాల్లో సినిమా 17వ రోజున ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 4-4.5 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది..ఇక కర్ణాటక తమిళ్ కేరళ కలిపి సినిమా 2.5-2.75 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీలో మాత్రం మాస్ ఊచకోత కోస్తున్న సినిమా అక్కడ ఈ రోజు..
ఓవరాల్ గా 23-24 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా మరోసారి జోరు చూపిస్తున్న నేపధ్యంలో వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 17వ రోజున 34.5-35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…
35-36 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 304 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 1485 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.
మొత్తం మీద సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోస్తున్న సినిమా ఆదివారం కూడా రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 17 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.