ఊహకందని కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ మూడో వీక్ లో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) 17వ రోజు దుమ్ము లేపగా 18వ రోజు ఇప్పుడు సండే అడ్వాంటేజ్ తో దుమ్ము లేపుతుంది…
సినిమా తెలుగు రాష్ట్రాలలో, హిందీలో కర్ణాటకలో మాస్ రచ్చ చేస్తుండగా మిగిలిన చోట్ల పర్వాలేదు అనిపిస్తూ ఉండగా…మొత్తం మీద 18వ రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ తో హౌస్ ఫుల్ బోర్డులతో మాస్ రచ్చ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ఎక్స్ లెంట్ గా…
జోరుని చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మరో కోటి షేర్ మార్క్ ని అందుకుంటే సినిమా ఆల్ టైం టాప్ 2 ప్లేస్ తో మాస్ రచ్చ చేయబోతుంది. టాలీవుడ్ చరిత్రలో ఏడున్నర ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి2 సినిమా 204 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా…
ఇప్పుడు పుష్ప2 మూవీ 17 రోజుల్లోనే ఏకంగా 203 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా 18వ రోజు సాధించిన కలెక్షన్స్ తో మమ్మోత్ బాహుబలి2 షేర్ ని క్రాస్ చేసి ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ షేర్ తో ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత ప్లేస్ లో నిలవడం ఖాయంగా మారిపోయింది ఇప్పుడు.
కానీ ఆర్ ఆర్ ఆర్ ని అందుకోవడం మాత్రం ప్రస్తుతానికి చాలా కష్టమే అని చెప్పాలి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకోబోతున్న సినిమా గా నిలవబోతుంది. సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో ఇంకా ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి ఇక…