బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన మూవీస్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ విడుదల పార్ట్ 2(Vidudala Part 2) సినిమా కూడా ఒకటి కాగా తెలుగు లో మిక్సుడ్ టాక్ ను తమిళ్ లో డీసెంట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
టాక్ ఓవరాల్ గా డిఫెరెంట్ గా ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం వీకెండ్ లో మంచి జోరుని చూపించి కుమ్మేసింది…. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా మూడో రోజు మరోసారి 50 లక్షల లోపే గ్రాస్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద…
3 రోజుల వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల లో 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 75 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక్కడ క్లీన్ హిట్ అవ్వాలి అంటే సినిమా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇంకా హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక సినిమా 3వ రోజు తమిళనాడులో మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ 7.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మిగిలిన చోట్ల కూడా పర్వాలేదు అనిపించినా సినిమా ఓవర్సీస్ లో కూడా డీసెంట్ హోల్డ్ ని చూపించగా టోటల్ గా ఇప్పుడు…
వీకెండ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Vidudala 2 Movie 3 Days Total World Wide Collections Approx.
👉Tamilnadu – 22.95CR~
👉Telugu States – 1.50Cr
👉Karnataka – 2.40Cr
👉ROI – 1.20Cr
👉Overseas – 9.15Cr***approx.
Total WW collection – 37.20CR(18.10CR~ Share) Approx.
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ టార్గెట్ 35 కోట్ల దాకా ఉండగా 3 రోజుల్లో ఆల్ మోస్ట్ సగం రికవరీని అందుకున్న సినిమా మిగిలిన రన్ లో మిగిలిన సగం టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో అందుకుని హిట్ అవుతుందో చూడాలి.