సెన్సేషనల్ కలెక్షన్స్ తో మూడో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) ఈ వీకెండ్ లో క్రిస్టమస్ హాలిడేస్ కలిసి రాబోతూ ఉండగా 19వ రోజున వర్కింగ్ డే లో సినిమా ఉన్నంతలో…
మంచి హోల్డ్ ని చూపించింది…18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 311 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ 1527 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 19వ రోజున ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో 1.6-1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే దిశగా…
దూసుకు పోతూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 2 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు. ఇక కర్ణటక, తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 70-80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీ లో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా…
అక్కడ నుండి ఈ రోజున సినిమా 11-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ ఇంకొంచం పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తూ ఉండటంతో టోటల్ గా 19వ రోజున వరల్డ్ వైడ్ గా సినిమా…
15.5-16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, హిందీ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం తూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా టోటల్ గా 19 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…
313 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 1543 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద 19 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.