బాక్స్ అఫీస్ దగ్గర ఈ ఇయర్ స్టార్టింగ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ అలాగే హనుమాన్ మూవీ వీర విహారం చేయడం వలన అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ ల…కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చిన గుంటూరు కారం(Guntur Kaaram Movie)…సినిమా
మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా లాంగ్ రన్ లో ఓవరాల్ గా 184 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది…సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు కన్నా కూడా రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవల్ లో హిట్ అయింది…ఓటిటి వర్షన్ వచ్చిన తర్వాత…
ఓవరాల్ గా సాంగ్స్ మరో లెవల్ లో హిట్ అవ్వడం, ఇతర భాషల వాళ్ళు కూడా సినిమాకి కనెక్ట్ అవ్వగా సినిమాలు మరో లెవల్ రీచ్ ను సొంతం చేసుకున్నాయి. అలాంటి రీచ్ తర్వాత ఇప్పుడు సినిమా ను మళ్ళీ రీ రిలీజ్ చేసే రేంజ్ లో రచ్చ చేసింది సినిమా…
జనవరిలో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఈ డిసెంబర్ 31న స్పెషల్ షోలతో రీ రిలీజ్ కాబోతుంది….సహజంగా కొత్త సినిమాలు రీ రిలీజ్ అవ్వడమే అరుదు…అందులోనూ ఒక ఏడాదిలోనే రిలీజ్ అయిన సినిమా మళ్ళీ రీ రిలీజ్ అవ్వడం అనేది ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు అని చెప్పాలి…
ఇక డిసెంబర్ 31న కేవలం 5 షోలతో సినిమాను మెయిన్ సెంటర్స్ లో స్పెషల్ షోలు వేయాలని డిసైడ్ అయ్యారు, కానీ వేసిన షోలు వేసినట్లు ఫుల్ అవుతూ ఉండటంతో షోల కౌంట్ అలా అలా పెరిగి పోతూ ఇప్పుడు ఏకంగా 50 కి పైగానే స్పెషల్ షోలతో సినిమా…
గ్రాండ్ గా రీ రిలీజ్ ను ఈ న్యూ ఇయర్ కానుకగా సొంతం చేసుకోబోతుంది…ఇది మాత్రం ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ భీభత్సం అని చెప్పాలి. ఫ్యాన్స్ లోనే కాదు కామన్ ఆడియన్స్ లో కూడా సినిమా సాంగ్స్ రీచ్ మరో లెవల్ లో ఉండటం వలనే ఈ రేంజ్ లో రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. ఇక స్పెషల్ షోల వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.