బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం గా హిట్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలలో బెల్లంకొండ శ్రీనివాస్(Bellam Konda Sreenivas) ఒకరు…అప్పుడెప్పుడో రాక్షసుడు తో మంచి హిట్ కొట్టినా తర్వాత పెద్దగా అంచనాలను అందుకున్న సినిమాలు రాలేదు….త్వరలో వరుస పెట్టి సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న బెల్లంకొండ ఇప్పుడు…
తన అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన కొత్త సినిమాకి టైటిల్ ను కన్ఫాం చేస్తూ ఒక స్పెషల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా….గ్లిమ్స్ క్వాలిటీ అండ్ గ్రాండియర్ సినిమా మీద మంచి అంచనాలు పెంచేసింది అని చెప్పాలి ఇప్పుడు.. సినిమా కి హైందవ అనే పవర్ ఫుల్ టైటిల్ ను కన్ఫాం చేయగా…
గ్లిమ్స్ లో ఒక పాత గుడిని కొందరు ద్వంసం చేయాలనీ ప్రయత్నంలో కాల్చడం చేస్తున్న టైంలో సడెన్ గా హీరో ఒక సింహం అలాగే ఒక వరాహం హెల్ప్ తో ఆ గుడిని కాపాడటానికి వస్తాడు….విలన్స్ ను అంతమొందించి ఆ గుడిని కాపాడుతూ తనలో ఒక మహా విష్ణు శ్రీహరి అవతారం ఉందంటూ…
గ్లిమ్స్ లో చూపించారు…ఓవరాల్ గా గ్లిమ్స్ క్వాలిటీ అండ్ లైట్ గా చూపించిన గ్రాఫిక్స్ హంగులు బాగానే ఆకట్టుకున్నాయి అని చెప్పాలి…. అదే టైంలో గ్లిమ్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది. సరైన బ్యాగ్రౌండ్ స్కోర్ పడి ఉంటే…
గ్లిమ్స్ రేంజ్ మరింతగా ఇంపాక్ట్ ని చూపించి ఉండేది అని చెప్పాలి…..రొటీన్ కమర్షియల్ అండ్ రీమేక్ మూవీస్ చేస్తున్న టైంలో డిఫెరెంట్ జానర్ మూవీస్ తో తన ఫ్యూచర్ కెరీర్ ని బాగానే ప్లాన్ చేసుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా తో…
ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి. అదే టైంలో ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఏ సినిమాతో ముందు ఆడియన్స్ ముందుకు వస్తాడు…తన అప్ కమింగ్ మూవీస్ తో ఏ సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇప్పుడు.