టాలీవుడ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాలు ఆడియన్స్ ముందుకు రావడం చాలా అరుదు అయిపొయింది…ఏడాది పొడవునా చూసుకుంటే టాప్ స్టార్స్ మూవీస్ రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ వలన చాలా తక్కువగానే రిలీజ్ అవుతున్నాయి. కానీ అలా రిలీజ్ అయిన మూవీస్ బజ్ పరంగా ఓపెనింగ్స్ పరంగా మాత్రం కుమ్మేస్తూ ఉండగా…
ఇప్పుడు 2025 ఇయర్ కి గాను ఆడియన్స్ ముందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది మొదటిగా…సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద…
మొదటి నుండి కూడా ఉండాల్సిన క్రేజ్ అయితే లేదు ఇప్పుడు…సినిమా మరీ లేట్ అయిపోవడం, ఇటు రామ్ చరణ్ అటు దిల్ రాజు మరియు డైరెక్టర్ శంకర్ ల ప్రీవియస్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచడం లాంటివి ఒక కారణం కావొచ్చు అని చెప్పొచ్చు…
బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 36 గంటల టైం కూడా లేదు కానీ సినిమా కి ఇటు ఆన్ లైన్ లో అటు ఆఫ్ లైన్ లో ఉండాల్సిన రచ్చ అయితే లేదు అనే చెప్పాలి. సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ చాలా గట్టిగానే చేశారు. ప్రతీ సాంగ్ కి ఈవెంట్ పెట్టారు… హిందీ లో ప్రమోషన్ చేశారు. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు…
చాలా టైం తర్వాత పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు…తమిళ్ అండ్ కన్నడ లో మాత్రం ప్రమోషన్స్ చేయలేదు…ఇవి పక్కకు పెడితే ఓవరాల్ గా సాలిడ్ ప్రమోషన్స్ జరిగినా కూడా సినిమా మీద ఆడియన్స్ లో ఉండాల్సిన రేంజ్ యుఫోరియా అయితే లేదనే చెప్పాలి.
రీసెంట్ టైంలో వచ్చిన టాప్ స్టార్ మూవీస్ కల్కి, దేవర, పుష్ప2 లాంటి సినిమాలతో పోల్చితే గేమ్ చేంజర్ మూవీ ఒక రోజు ముందు హంగామా మినిమమ్ లేదనే చెప్పాలి….మేకర్స్ మరి కాస్త పుషప్ ఇచ్చి ప్రమోషన్స్ స్పెషల్ ఇంటర్వ్యూలు లాంటివి ఎక్కువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండగా…
ఇప్పుడు ఎంత సైలంట్ అయినా కూడా సినిమా కనుక రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఈ లెక్కలన్నీ తారుమారు చేసి సాలిడ్ కలెక్షన్స్ ని సంక్రాంతికి సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…అందరూ అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఉండటం కూడా…
సినిమాకి ఒకింత ఆడియన్స్ లో అంచనాలు మినిమమ్ ఉండేలా చేస్తుంది….సినిమా అందరి అంచనాలను మించే రేంజ్ లో మెప్పిస్తే అప్పుడు మౌత్ టాక్ ముందు ఈ ప్రమోషన్స్ బజ్ లాంటివి ఏవి తక్కువ అయినా కలెక్షన్స్ సాలిడ్ గా కుమ్మేయోచ్చు…టీం కూడా ఇప్పుడు…
ఇదే జరుగుతుంది అని ఆశిస్తున్నారు….ప్రస్తుతానికి అయితే గేమ్ చేంజర్ నిజమైన గేమ్ చేంజర్ లా అయితే అనిపించడం లేదు కానీ ఎప్పుడు గేమ్ టర్న్ అయ్యి రియల్ గేమ్ స్టార్ట్ అయ్యేది తెలియదు కాబట్టి మరో రోజున్నర లో గేమ్ ఎలా మారుతుందో అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.