Home న్యూస్ రామ్ చరణ్ @ 1030 కోట్లు….కెరీర్ బెస్ట్ మాస్ ఊచకోత ఇది!!

రామ్ చరణ్ @ 1030 కోట్లు….కెరీర్ బెస్ట్ మాస్ ఊచకోత ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా చాలా టైం తర్వాత సినిమా చేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా మంచి అంచనాల నడుమ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా…సినిమా మరీ అలాస్యం అవ్వడం అలాగే ఇందులో భాగం అయిన…

రామ్ చరణ్, శంకర్ మరియు దిల్ రాజు ప్రీవియస్ మూవీస్ రిజల్ట్ ల వలన కొంచం బజ్ తక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారి టాక్ బాగుంటే లెక్కలన్నీ మారే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బిజినెస్ పరంగా రామ్ చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను…

సొంతం చేసుకున్న గేమ్ చేంజర్ మూవీ ఏకంగా 221 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుని మాస్ రచ్చ చేసింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 223 కోట్ల మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…రామ్ చరణ్ నటించిన రీసెంట్ 6 మూవీస్…

బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల మమ్మోత్ బిజినెస్ మార్క్ ని దాటేయడం విశేషమని చెప్పాలి. అందులో 2 మల్టీ స్టారర్ మూవీస్ కూడా ఉండగా ఓవరాల్ గా 6 సినిమాల ప్రీ రిలీజ్ లెక్క 1000 కోట్ల మార్క్ ని దాటేసి మాస ఊచకోత కోసింది.

ఒకసారి రామ్ చరణ్ రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
Ram Charan Recent Movies Pre Release Business Details 
👉#GameChanger – 221CR******
👉#Acharya(Multi Starrer) – 131.20CR
👉#RRR(Multi Starrer) – 451CR
👉#VinayaVidheyaRama – 90CR
👉#Rangasthalam – 80CR+
👉#Dhruva – 57CR~

మొత్తం మీద 6 సినిమాల్లో 2 మల్టీ స్టారర్ మూవీస్ ని పక్కకు పెడితే 448 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను 4 సినిమాలతో సొంతం చేసుకుని కుమ్మేశాడు రామ్ చరణ్…ఇక గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేసి ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఎంతవరకు రికవరీ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here