2025 ఫస్ట్ బిగ్గీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయింది. ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది…. మొత్తం మీద స్టోరీ పాయింట్ ఏమి రివీల్ చేయడం లేదు కానీ….
కలెక్టర్ గా ఛార్చ్ తీసుకున్న హీరోకి ప్రభుత్వంలో ఉన్న కరప్షన్ అస్సలు నచ్చదు…దాంతో ఎదురు తిరగడం మొదలు పెడతాడు….హీరో ఎదురు తిరగడం సిఎమ్ వరకు వెళుతుంది…ఆ తర్వాత కలెక్టర్ కి సిఎమ్ కి పోటి లో ఏం జరిగింది అన్నది మెయిన్ థీమ్…కానీ సినిమాలో అనేక ఉప కథలు అలాగే కీలకమైన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది…
అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….సినిమా స్టార్ట్ అవ్వడమే ఆసక్తిగా స్టార్ట్ అయ్యి హీరో మాస్ ఎంట్రీ తర్వాత కథ ఎస్టాబ్లేష్ చేసే సీన్స్ కొంచం స్లో అయినట్లు అనిపించినా లవ్ సీన్స్ కొన్ని పర్వాలేదు అనిపిస్తూ అక్కడక్కడా లైట్ కామెడీ సీన్స్ తో అలా అలా సాగే సినిమా మధ్యలో…
ఫైట్ సీన్స్ తో ఓవరాల్ గా ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా సాగుతూ ఉన్న టైంలో ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు శంకర్ మ్యాజిక్ పనిచేసి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగేలా చేస్తుందని చెప్పాలి…దాంతో సెకెండ్ ఆఫ్ మెయిన్ కథ మొదలు అయ్యి…
కీలకమైన ఫ్లాష్ బ్యాక్ రొటీన్ గానే స్టార్ట్ అయినా హార్ట్ టచింగ్ గా ముగిసి తర్వాత హీరో విలన్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ తో ఓవరాల్ గా ఫస్టాఫ్ మీద చాలా బెటర్ గా సెకెండ్ ఆఫ్ ఉంటుంది…. హీరో ఎలివేషన్ సీన్స్ కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం మాస్ ఆడియన్స్ కి…
మంచి కిక్ ఇవ్వడం ఖాయమని చెప్పాలి…ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్ రొటీన్ గానే అనిపించినా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన గేమ్ చేంజర్ ఈజీగా ఒకసారి చూసేలా అయితే ఉంటుంది అని చెప్పొచ్చు….హీరో ఎలివేషన్ లు బాగానే వర్కౌట్ అవ్వడం, సాంగ్స్ విజువల్ గా ఎక్స్ లెంట్ గా ఉండటం…
హీరో విలన్ ల మధ్య సీన్స్ కొన్ని ఎక్స్ లెంట్ గా రావడం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగానే వర్కౌట్ అవ్వడంతో పార్టు పార్టులుగా సినిమా మినిమమ్ గ్యారెంటీ అనిపించే రేంజ్ కంటెంట్ తో ఆకట్టుకుంది…. మొత్తం మీద ఫస్టాఫ్ యావరేజ్ రేంజ్ లో సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో…
అనిపించగా ఓవరాల్ గా సినిమా మొత్తం మినిమమ్ ఎబో యావరేజ్ రేంజ్ మూవీ లా అనిపించింది ప్రీమియర్స్ అయ్యాక…ఆడియన్స్ నుండి కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక రెగ్యులర్ షోలకు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.