బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వరుస హిట్స్ తో బాలయ్య కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్నాడు కానీ అఖండ కన్నా ముందు పరిస్థితి చాలా కష్టంగా ఉండగా, తన కెరీర్ లోనే లోవేస్ట్ ఫేజ్ లో ఉన్న బాలయ్య సింగిల్ డిజిట్ షేర్స్ తో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న టైంలో అఖండ తో అల్టిమేట్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా…
తర్వాత నుండి కెరీర్ లో ఫ్లాఫ్ లేకుండా సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ అల్టిమేట్ ఫామ్ తో దూసుకు పోతూ ఉండటం విశేషమని చెప్పాలి ఇప్పుడు….ఇక బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie)…
వరల్డ్ వైడ్ గా సంక్రాంతికి రిలీజ్ కానుండగా కెరీర్ లో మొదటి సారి 80.70 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న బాలయ్య కెరీర్ లో చేసిన లాస్ట్ 6 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఏకంగా 368 కోట్ల మార్క్ ని దాటేయడం విశేషం అని చెప్పాలి…
సింగిల్ డిజిట్ షేర్స్ నుండి ఈ రేంజ్ లో కంబ్యాక్ ను సొంతం చేసుకుని తన మార్కెట్ ను ఓ రేంజ్ లో పెంచుకుని బాలయ్య ఊరమాస్ ఊచకోత కోశాడు అని చెప్పాలి. ఒకసారి బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే….
#Balakrishna Recent Movies Business Details
👉#DaakuMaharaaj – 80.70CR******
👉#BhagavanthKesari – 67.35CR
👉#VeeraSimhaReddy – 73CR
👉#Akhanda – 53Cr
👉#Ruler – 23.75Cr
👉#NTRKathanayakudu- 70.60Cr
👉#Jaisimha – 26cr
👉#PaisaVasool – 32.5Cr
👉#GPSK – 46Cr
ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు మరియు రూలర్ లాంటి ఎపిక్ డిసాస్టర్ మూవీస్ తో ఈ రేంజ్ కంబ్యాక్ ను ఎవ్వరూ అయితే ఎక్స్ పెర్ట్ చేయలేదు….బాలయ్య కెరీర్ పీక్ టైంలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న డాకు మహారాజ్ మూవీ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.