సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వారాలను కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), 6వ వారంలో అడుగు పెట్టగా సంక్రాంతి సీజన్ స్టార్ట్ అవ్వడంతో చాలా వరకు థియేటర్స్ ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండగా…
36వరోజు ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే జోరు చూపించింది ఇప్పుడు.. తెలుగు హిందీ తెలుగు లో లిమిటెడ్ డ్రాప్స్ తోనే డీసెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా ఓవరాల్ గా 36 వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 21 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
వరల్డ్ వైడ్ గా 88 లక్షల రేంజ్ లో షేర్ ని 2.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా అన్ని చోట్లా రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా 36 రోజుల్లో మొదటి సారి కోటి లోపు షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది పుష్ప2 మూవీ…దాంతో ఇప్పుడు ఓవరాల్ గా…
36 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 36 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 103.62Cr
👉Ceeded: 35.35Cr
👉UA: 24.91Cr
👉East: 13.59Cr
👉West: 10.32Cr
👉Guntur: 15.98Cr
👉Krishna: 13.13Cr
👉Nellore: 8.15Cr
AP-TG Total:- 225.05CR(342.45CR~ Gross)
👉KA: 53.18Cr
👉Tamilnadu: 34.70Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 382.35Cr
👉OS – 127.05Cr***Approx
Total WW Collections : 829.93CR(Gross- 1,740.10CR~)
మొత్తం మీద 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 209.93 కోట్ల హిస్టారికల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక ఫైనల్ రన్ లో ప్రాఫిట్ ను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.