బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా అన్ని చోట్లా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా, హిందీ లో సినిమా జోరు ఎలా ఉండబోతుంది అని కూడా…
అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు…సినిమా హిందీలో ఎక్స్ లెంట్ రిలీజ్ ను సొంతం చేసుకోగా అడ్వాన్స్ బుకింగ్స్ లేట్ గానే ఓపెన్ అవ్వగా బుకింగ్స్ మొదటి రోజు ముందు టికెట్ సేల్స్ సాలిడ్ గానే జరిగినా కూడా బాలీవుడ్ లో సినిమా…
టికెట్ సేల్స్ పై గట్టిగానే ట్రోల్స్ పడ్డాయి ప్రమోషన్స్ లో టికెట్స్ ను పంచుతున్నారు అని…ఇవి పక్కకు పెడితే డీసెంట్ బుకింగ్స్ నే సినిమా హిందీ లో సొంతం చేసుకోగా ఆక్యుపెన్సీ అండ్ థియేటర్స్ లో ఫుట్ ఫాల్స్ పర్వాలేదు అనిపించే విధంగా కొనసాగుతూ ఉండగా….
ఆన్ లైన్ టికెట్ సేల్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజు అక్కడ 6-8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…హిందీ కలెక్షన్స్ అందరినీ ఆశ్యర్య పరిచే ఛాన్స్ కనిపిస్తుంది…మాస్ సెంటర్స్ లో పూర్తి ట్రాకింగ్ ఉండదు కానీ…
మాస్ సెంటర్స్ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా మొదటి రోజు కలెక్షన్స్… మరింత పెరిగే అవకాశం హిందీ లో ఉంది…..ఓవరాల్ గా సినిమా మీద ఉన్న బజ్ కి ఈ రేంజ్ లో వసూళ్ళని అందుకున్నా, ఇంతకు మించి ముందుకు వెళ్ళినా కూడా అది మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఇక సినిమా హిందీ లో టార్గెట్ అందుకోవాలి అంటే మాత్రం…
ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది… మరి మొదటి రోజు హిందీ లో ఈ అంచనాలను సినిమా ఎంతవరకు మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో లేక ఇదే రేంజ్ లో వసూళ్ళని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.