ఒకప్పుడు మంచు ఫ్యామిలీ అంటే పెద్దగా ట్రోల్స్ లాంటివి ఉండేవి కాదు కానీ…తర్వాత టైంలో అనుకోకుండా చాలా సార్లు మంచు ఫ్యామిలీ ఎదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తూ ట్రోల్స్ ను కూడా ఫేస్ చేయాల్సివచ్చింది…అది సినిమా సినిమాకి ఓ రేంజ్లో పెరిగిపోతూ రాగా రీసెంట్ గా అన్నదమ్ముల మధ్య గొడవలు కూడా మరింతగా వార్తల్లో నిలుస్తూ ఉండగా..
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు(Manchu Vishnu) మరియు మంచు మనోజ్(Manchu Manoj) నటించిన సినిమాల మధ్య పోటి ఒకే రోజున ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ లో సమాచారం….మంచు విష్ణు నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా…
మూవీ అయిన కన్నప్ప(Kannappa Movie) ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా….సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉండటం, అందరినీ మించి ప్రభాస్ సినిమాలో ఉండటంతో అంచనాలు అయితే పెరిగిపోయాయి అని చెప్పాలి.
ఇక అదే రోజున మరో సినిమా రిలీజ్ కి సన్నాహాలు మొదలు అయ్యాయని టాక్ గట్టిగా వినిపిస్తుంది…బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మంచు మనోజ్ మరియు నారా రోహిత్ ముఖ్య రోల్స్ లో నటిస్తున్న భైరవం(Bhairavam Movie) సినిమా మీద కూడా..
డీసెంట్ అంచనాలు ఏర్పడగా ఈ సినిమా సమ్మర్ రిలీజ్ అని అనౌన్స్ చేసినా కూడా సరైన డేట్ దొరక్క పోవడంతో ఆ డేట్ ఈ డేట్ అంటూ వార్తలు వస్తున్నా కూడా సినిమాను అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు…
దాంతో ఇదే కనుక కన్ఫాం అయితే అదే రోజున మంచు ఫ్యామిలీ బ్రదర్స్ నటించిన సినిమాల మధ్య పోటి అంటూ సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు….పెద్దగా క్లాష్ కి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ తక్కువే అయినా కూడా సమ్మర్ లో టైట్ షెడ్యూల్ ఉండటంతో పోటి కన్ఫాం అయితే సోషల్ మీడియాలో ఇక చుక్కలు కనిపించడం ఖాయమని చెప్పాలి.