బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా హిట్ కి దూరం అయిన హీరోలలో ఒకరైన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద ఆల్ రెడీ ఆడియన్స్ లో మంచి బజ్ ఉండగా ట్రైలర్ కూడా బాగానే క్లిక్ అయింది.
దాంతో ఏమాత్రం టాక్ డీసెంట్ గా ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా మంచి జోరుని సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న నితిన్ కి తిరిగి మంచి బిజినెస్ నే సొంతం అయ్యేలా చేసింది. పోటి తీవ్రంగా ఉండటంతో…
బిజినెస్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగినా కూడా ఓవరాల్ గా సినిమా కి వరల్డ్ వైడ్ గా మంచి బిజినెస్ జరగగా పోటిని తట్టుకుని సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా జోరు చూపించాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి.
ఒకసారి సినిమా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#RobinHood WW Pre Release Business Details(Valued)
👉Nizam: 9.50Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 10.50Cr
AP-TG Total:- 23CR
👉KA+ROI+OS – 4.50Cr
Total WW: 27.50CR(Break Even- 28.50CR~)
ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 27.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను ఇప్పుడు సొంతం చేసుకోగా…బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 28.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
నితిన్ ప్రీవియస్ మూవీస్ ఏవి పెద్దగా అంచనాలను అందుకోలేకపోయినా కూడా నితిన్ వెంకి కొడుముల కాంబోలో వచ్చిన భీష్మ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్ లో రిజల్ట్ రిపీట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజామవుతుందో చూడాలి.