కింగ్ నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిధ్ధం అవుతుంది. సినిమా పై రిలీజ్ కి ముందు నుండే మంచి పాజిటివ్ బజ్ ఏర్పడటంతో బుకింగ్స్ అండ్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది…
కాగా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ని ఒకసారి గమనిస్తే గనుక సినిమాకి రెండు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 55% ఆన్ లైన్ బుకింగ్స్ జరిగాయి..ఆఫ్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ బాగానే ఉన్నా మరీ అంచనాలను మించి అయితే లేదని చెప్పొచ్చు.
సినిమా కి ఓపెనింగ్స్ బాగానే రావడం పక్కా అని చెప్పొచ్చు….కానీ పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ రోజు ఎండింగ్ వరకు భారీగానే ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద మొదటి రోజు ఇనీషియల్ ప్రిడిక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాలలో 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.