బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ “కేసరి”… బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా హోలీ హాలిడే రోజున రిలీజ్ అయిన ఈ సినిమా అద్బుతమైన రివ్యూ లను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము లేపింది, సినిమా మొదటి వీకెండ్ 4 రోజుల్లో 56 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో అందుకుంది, కాగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సినిమా మంచి జోరు చూపింది.
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి వారం సాధించిన నెట్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి… Day1 – Thu 21.06 cr, Day 2- Fri 16.75 cr, Day 3 – Sat 18.75 cr, Day 4 – Sun 21.51 cr,Day 5 – Mon 8.25 cr, Day 6 – Tue 7.17 cr, Day 7 – Wed 6.52 cr, Total First Week: ₹ 100.01 cr
సినిమా ను సుమారు 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకేక్కించగా సినిమా శాటిలైట్ ఇతర హక్కులను పక్కకు పెట్టి బిజినెస్ ఇండియా లో 80 కోట్ల రేంజ్ లో ఉండగా సుమారు 140 కోట్ల లోపు నెట్ వసూళ్లు అందుకోవాల్సి ఉంటుంది, రెండో వీకెండ్ జోరు చూపే అవకాశం ఉండటం తో బ్రేక్ ఈవెన్ అవకాశం ఉందని చెప్పొచ్చు.