రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అన్న టాక్ లభించింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం కల్కి సినిమా అంచనాలను అందుకోవడం ఘోరంగా విఫలం అయ్యింది, ఎంతలా అంటే బిజినెస్ లో మూడో వంతు కూడా కలెక్ట్ చేయలేక భారీ డిసాస్టర్ గా బాక్స్ ఆఫీస్ బరిలో మిగిలి పోయింది.
కాగా సినిమా కి ఏకంగా 25 కోట్ల బడ్జెట్ పెట్టగా సినిమాను 11 కోట్లకు అమ్మారు… కాగా సినిమా 12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఫైనల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 2.4 కోట్ల షేర్ ని వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గా 2.8 కోట్ల షేర్ ని మాత్రమే వసూల్ చేసి షాక్ ఇచ్చింది.
దాంతో బిజినెస్ ని అందుకోలేక ఏకంగా 9.2 కోట్ల లాస్ ని సొంతం చేసుకుని ట్రిపుల్ డిసాస్టర్ గా మిగిలిపోయింది. టాక్ బాగానే ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి ప్రదర్శనకి కారణాలు మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదని చెప్పొచ్చు. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలిచే సినిమా అవుతుంది.