13 ఏళ్ల క్రితం దేవదాస్ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంటర్ అయ్యాడు హీరో రామ్, ఆ తర్వాత చేసిన సినిమాల్లో విజయాల కన్నా అపజయాలు ఎక్కువగా ఉన్నా కానీ రామ్ సినిమాలకు ట్రేడ్ లో ఎప్పుడూ మినిమమ్ బజ్ వుంటూ వచ్చింది, కానీ సరైన బ్లాక్ బస్టర్ మాత్రం తగల్లేదు రామ్ కి. రెడీ, కందిగీర మరియు నేను శైలజ లాంటి హిట్స్ ఫ్లాఫుల్లో రామ్ కి తిరిగి రీచార్జ్ అయ్యే అవకాశం ఇచ్చి మంచి విజయాలుగా నిలిచాయి.
కానీ ఒక హీరో కి టర్నింగ్ పాయింట్ అంటూ ఒక సినిమా ఉంటుంది, చిరంజీవి కి ఖైదీ లా, బాలయ్య కి సమరసింహారెడ్డి లా, పవన్ కి బద్రి – ఖుషీ లా, ఎన్టీఆర్ కి ఆది – సింహాద్రి లా, మహేష్ కి ఒక్కడు లా ఇలా అందరు హీరోలకు కెరీర్ లో ఒక దశలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది.
ఇప్పుడు రామ్ కి కెరీర్ మొదలు పెట్టిన 13 ఏళ్ళకి ఇస్మార్ట్ శంకర్ సినిమా తో అల్టిమేట్ టర్నింగ్ పాయింట్ వచ్చింది అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో రీసెంట్ టైం లో మాస్ లో భారీ విజయమ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలవబోతున్న ఈ సినిమా రామ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గానే కాకుండా…
కెరీర్ లో హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమా కూడా అయ్యింది అని చెప్పొచ్చు, ఇది వరకు రామ్ నటించిన సినిమాల్లో నేను శైలజ సినిమా ఆల్ మోస్ట్ 21 కోట్ల షేర్ ని వసూల్ చేసి కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్ ని కేవలం 4 రోజులలోనే బ్రేక్ చేయనున్నాడు రామ్..
లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుంది అన్నది సోమవారం హోల్డ్ చేసిన తీరుని బట్టి చెప్పొచ్చు. మినిమం 2.5 కోట్ల రేంజ్ షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుంటే ఫైనల్ రన్ లో 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ షేర్ వసూల్ చేసే అవకాశం కూడా ఈ సినిమా కి ఉందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.