2019 మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ముందు నిలిచిన సినిమా సాహో ఎట్టకేలకు అనేక అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, వరల్డ్ వైడ్ గా సుమారు 8200 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ప్రీమియర్ షోలను దుబాయ్ లో తర్వాత అమెరికా లో పూర్తి చేసుకుంది, అక్కడ నుండి సినిమా కి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసు కుందాం పదండీ. ముందుగా కథ పాయింట్ ని టోటల్ గా రివీల్ చేయకున్నా…
ఓ 2000 కోట్ల రాబరీ ని రికవరీ చేయడానికి హీరో అలాగే క్రైం బ్రాంచ్ కి చెందిన హీరోయిన్ వెళతారు, అలాగే మరికొందరు గాజీ అనే విలన్స్ సిటీ లో ఉండే ఒక లాకర్ దొరికితే వేల కోట్లు తమ వశం అవుతాయి అనుకుంటారట, అసలు వాళ్ళకి వీళ్ళకి లింక్ ఏంటి, అసలు 2000 కోట్లు కొల్లగొట్టింది ఎవ్వరూ, హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఏంటి అనేది అసలు కథ అంటున్నారు.
కథ చెప్పడానికి సింపుల్ గా ఉన్నా అనేక ట్విస్ట్ లు టర్న్ లతో ప్రేక్షకుల మెదడు తో పజిల్ ఆడుతూ ఉంటుందని అంటున్నారు, ఇందులో ప్రభాస్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజన్స్, ఫైట్స్, స్టైల్ ఇలా వన్ మ్యాన్ షో గా ఉంటుందని, శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా బాగుందని బాగా పెర్ఫార్మ్ చేసిందని అంటున్నారు.
మిగిలిన నటీనటులు అందరు తమ రోల్స్ మేరకు మెప్పించాగా, సినిమా మొదటి అర్ధభాగంలో ఫస్ట్ 20 నిమిషాలు ఓ రేంజ్ లో ఉంటుందని, తర్వాత కథ మళ్ళీ సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుందని, మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమా రేంజ్ ఓ లెవల్ కి వెళుతుందని అంటున్నారు.
ఇక సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయిన ఫీలింగ్ కలిగినా తిరిగి ఓ హై ఫీలింగ్ కలిగించే సీన్స్ తో ఆసక్తి గా సాగే కొన్ని సీన్స్ ఆకట్టుకోగా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ చేసే విజువల్స్ అండ్ స్క్రీన్ ప్లే తో దుమ్ము లేపాయని అంటున్నారు.
సంగీతం పరంగా ఒకటి రెండు ఆకట్టుకున్నా మిగిలినవి నిరాశ పరిచాయని, కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం దుమ్ము లేపిందని అంటున్నారు, ఇక డైరెక్షన్ పరంగా సుజీత్ చాలా బాగా ఆకట్టుకున్నాడని, స్క్రీన్ ప్లే, టేకింగ్ పరంగా తన మార్క్ ని చూపెట్టి మెప్పించాడని అంటున్నారు. మొత్తం మీద సినిమాలో…
ప్రభాస్, ఫైట్స్, విజువల్స్ అండ్ గ్రాండియర్, బ్యాగ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటూనే, ముందుగా చెప్పినట్లు సాంగ్స్, కొన్ని సీన్స్ లో VFX, సినిమా లెంత్, కొన్ని బోర్ సీన్స్ మైనస్ అని అంటున్నారు. కానీ ఓవరాల్ గా ఫ్యాన్స్ ని కామన్ ఆడియన్స్ ని సినిమా ఆకట్టుకుంటుందని అంటున్నారు.
సినిమా కి మొత్తం మీద ఓవర్సీస్ ఆడియన్స్ నుండి యావరేజ్ నుండి ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ వినిపిస్తుంది అని చెప్పాలి, ఇక ఇదే రేంజ్ లో టాక్ రెగ్యులర్ షోలకి కూడా కంటిన్యు అయ్యి రోజు మొత్తం క్యారీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ఊచకోత మరో లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు.