Home న్యూస్ 2019 ఇండియన్ సినిమాల్లో No.(1)…1.5 రేటింగ్ తో అరాచకం!!

2019 ఇండియన్ సినిమాల్లో No.(1)…1.5 రేటింగ్ తో అరాచకం!!

0

     యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో పై రిలీజ్ కి ముందు ఉన్న అంచనాలు బాహుబలి కి ఏమాత్రం తక్కువ కాని రేంజ్ లో ఉండేవి, కానీ రిలీజ్ అయిన మొదటి షో కే సినిమా కి భారీ గా నెగటివ్ టాక్ లభించింది, దాదాపు అందరు సినిమాకి కేవలం 1.5 రేంజ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు(మేం 2.75 ఇచ్చాం)… దాంతో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ ఓ రేంజ్ లో పడుతుంది అనుకున్నా….

మొదటి 4 రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉండటం తో కలెక్షన్స్ ఓ రేంజ్ లో వచ్చాయి, కానీ అప్పటికే టాక్ స్ప్రెడ్ అవ్వడం తో సౌత్ లో స్లో అయిన సినిమా నార్త్ లో మాత్రం స్టడీ గానే పరుగును కొనసాగించి క్లీన్ హిట్ గా నిలిచింది.

కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ టోటల్ వరల్డ్ గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 385 కోట్లు, నిర్మాతల లెక్కల్లో 405 కోట్ల మార్క్ ని అందుకోగా 2019 ఇయర్ కి గాను ఇండియన్ సినిమాల పరంగా బిగ్గెస్ట్ గ్రాసర్ గా సాహో నిలిచి ఆల్ టైం రికార్డ్ కొట్టింది అని చెప్పాలి.

ఒక సారి ఈ ఇయర్ ఇండియా లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 5 బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ గ్రాసర్స్ ని పరిశీలిస్తే
? 1)#Saaho- 385Cr- 405Cr*
? 2)#KabirSingh – 377Cr
? 3)#Uri – 336Cr
? 4)#Bharath -306Cr
? 5)#MissionMangal – 280Cr*
సాహో మిగిలిన సినిమాల రికార్డులు అన్నీ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది అని చెప్పాలి.

ఇక్కడ మరో బిగ్గెస్ట్ రికార్డ్ ఏంటి అంటే కేవలం 1.5 రేంజ్ స్టార్ రేటింగ్ తో సాహో సినిమా ఈ రేంజ్ లో ఊచకోత కోయడం అంటే ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ విషయం లో మాత్రం ప్రభాస్ ని శెభాష్ అంటూ మెచ్చుకోవాల్సిందే. లాంగ్ రన్ లో సినిమా మరో 30 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here