టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా టెంపర్, ఆ సినిమా నుండి అపజయం అంటే తెలియకుండా దూకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి సినిమా ముందుగా హిందీ లో రీమేక్ అవ్వగా అక్కడ ఆడియన్స్ టెస్ట్ మేరకు మార్పులు చేయడం తో అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది సింబా సినిమా, ఇక టెంపర్ సినిమా ను తమిళ్ లో విశాల్ హీరోగా…
అయోగ్య పేరుతో రీమేక్ చేయగా అక్కడ అనుకున్న రేంజ్ లో సినిమా ఆడలేదు. భారీ డిసాస్టర్ గా నిలిచింది. అలాంటి సినిమా ను తెలుగు లో ఆల్ రెడీ చూసి ఉన్నా కానీ డబ్ చేసి రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఎలాంటి ప్రమోషన్ లేదు, మార్కెటింగ్ లేదు. డైరెక్ట్ గా రిలీజ్ చేసినా కానీ…
అయోగ్య సినిమా కి తెలుగు లో మంచి వసూళ్ళు దక్కాయి, తెలుగు లో సినిమా ను సుమారు 2.2 కోట్ల రేంజ్ లో అమ్మారట. దాంతో సినిమా ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 2.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఫైనల్ రన్ ముగిసే సమయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర…
1.86 కోట్ల షేర్ ని ఈ సినిమా సాధించి షాక్ ఇచ్చింది, ఎలాంటి ప్రమోషన్స్ లేవు, టీవీ లో కూడా పెద్దగా ప్రమోస్ ని రిలీజ్ చేయలేదు అయినా కానీ మంచి వసూళ్ళనే సినిమా ఇక్కడ సాధించి బిజినెస్ లో కేవలం 34 లక్షలు లాస్ ని మాత్రమె సొంతం చేసుకుంది. తమిళ్ ఆడియన్స్ తెలుగు సినిమాలను పెద్దగా ఆదరించక పోయినా కానీ…
తెలుగు ఆడియన్స్ మాత్రం జస్ట్ పోస్టర్స్ చూసి థియేటర్ కి వెళ్లి ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించడం విశేషం అనే చెప్పాలి, అది కూడా తెలుగు సినిమా రీమేక్ డబ్ అయి మళ్ళీ తెలుగు లోనే రిలీజ్ అయినా చూశారు అంటే మన ఆడియన్స్ ని కూడా మెచ్చుకోవాల్సిందే. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.