నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ మంచి అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు 1100 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకుంది, అక్కడ నుండి సినిమా కి ముందుగా ఎలాంటి టాక్ లభించింది అన్నది ఆసక్తిగా మారింది. ఆ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…
స్టొరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకపోయినా కానీ తమకి వచ్చిన సమస్య ని 5 గురు ఆడవాళ్ళూ ఒక రైటర్ సహాయం తో పరీక్షరించుకోవాలి అనుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న హీరో వీళ్ళకి ఎలా హెల్ప్ చేశాడు అన్నది కాన్సెప్ట్ అంటున్నారు. కాన్సెప్ట్ చెప్పడానికి సింగిల్ లైన్ లోనే ఉన్నా…
విక్రం కుమార్ టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే తో ఫస్టాఫ్ మొత్తం సరదా సరదా గా సాగుతూ పాత్రల పరిచయం వాటి మధ్య కామెడి సీన్స్ తో మంచి పాటలతో ఫస్టాఫ్ మొత్తం అంచనాలను అందుకుని ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరి పోగా సెకెండ్ ఆఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతాయి అని అంటున్నారు.
సెకెండ్ ఆఫ్ ఆ అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయినా కానీ కొన్ని మంచి సీన్స్ తో సెకెండ్ ఆఫ్ కూడా ఆకట్టుకునే విధంగానే సాగుతుందని, కానీ కథ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉంటుందని, అది తప్పితే మొత్తం మీద సినిమా బాగా ముగుస్తుందని అంటున్నారు. నాని తన రోల్ లో ఆకట్టుకోగా…
తనదైన పెర్ఫార్మెన్స్ అండ్ కామిడీ టైమింగ్ తో తన మార్క్ ని మరోసారి చూపెట్టి మెప్పించాడని అంటున్నారు. ఇక హీరోయిన్ ప్రియాంక ఉన్నంతలో ఆకట్టుకోగా మిగిలిన ఆడవాళ్ళ కామెడీ అండ్ వెన్నెల కిషోర్ కామెడీ ఆకట్టుకుంటాయని, కార్తికేయ విలన్ గా ఉన్న తక్కువ స్క్రీన్ టైం లోనే తన మార్క్ ని చూపెట్టి మెప్పించాడని అంటున్నారు.
ఇక సంగీతం పరంగా బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా అనిరుద్ తన మార్క్ ని చూపెట్టి సినిమా రేంజ్ ని పెంచాడని అంటున్నారు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరింత టైట్ గా ఉండి కొన్ని సీన్స్ ని తగ్గించి ఉంటే రన్ టైం కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యేదని అంటున్నారు. ఇక విక్రం కుమార్ డైరెక్షన్
మరీ 13 బి, 24 లాంటి సినిమాల రేంజ్ లో లేకపోయినా కానీ సింపుల్ గా స్క్రీన్ ప్లే తో కామెడీ ఎంటర్ టైనర్ తీశాడని, అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడని అంటున్నారు. కానీ అక్కడక్కడా స్లో అవ్వడం క్లైమాక్స్ అంత ఇంపాక్ట్ ఇచ్చేలా లేకపోవడం కొద్దిగా మైనస్ అయ్యాయని అంటున్నారు.
ఓవరాల్ గా సినిమా కి ఓవర్సీస్ ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ టు హిట్ కి మధ్యలో టాక్ ఉందని చెప్పాలి. ఎలాగు ఇలాంటి డిఫెరెంట్ స్క్రీన్ ప్లే బేసుడ్ మూవీస్ కి అక్కడ మంచి టాక్ రావడం ఖాయం, ఇక రెగ్యులర్ షోలకి ఎలాంటి టాక్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.