టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కెరీర్ ఒక హిట్ ఒక ఫ్లాఫ్ తో కొనసాగింది, కెరీర్ తొలినాళ్ళలో షాక్ తో ఫ్లాఫ్ కొట్టి కొంతకాలం దూరంగా ఉన్న హరీష్ తర్వాత మిరపకాయ్ తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు, ఆ వెంటనే గబ్బర్ సింగ్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టగా అప్పటికే ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయిన హరీష్ శంకర్ రామయ్యా వస్తావయ్యా తో కెరీర్ లో అతి పెద్ద డిసాస్టర్స్ లో ఒకటిని…
ఎన్టీఆర్ కి తనకి దక్కేలా చేసుకున్నాడు. దాంతో అప్పటి నుండి మళ్ళీ స్టార్ హీరోలతో చేయడానికి కొత్త సమయం తీసుకున్న హరీష్ దువ్వాడ జగన్నాథం తో మళ్ళీ ట్రాక్ లోకి ఎక్కాడు. ఇప్పుడు వాల్మీకి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ…
అందరు టాప్ హీరోలతో చేయాలని నాకు ఉంటుందని కచ్చితంగా అందరితో సినిమాలు చేస్తానని చెబుతూ తనని ఎంతగానో నమ్మిన ఎన్టీఆర్ కి నేను రామయ్యా వస్తావయ్యా తో అంచనాలను అందుకోలేక పోయాను, ఆ విషయం లో మాత్రం ఇప్పటికీ భాద పడుతూనే ఉంటాను అని అన్నాడు.
ఆ టైం లో ఆ సినిమా ఇద్దరికీ ఎంతో కీలమైన సినిమా కానీ అంచనాలు తప్పడం తో ఇద్దరికీ భారీ షాక్ ఇచ్చింది, ఎన్టీఆర్ తో తాను రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నా సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాని, త్వరలోనే ఎన్టీఆర్ తో ఓ భారీ బ్లాక్ బస్టర్ కొడితేనే…. ఈ లెక్క సెట్ అవుతుందని చెప్పాడట.
ప్రస్తుతం ఎన్టీఆర్ కమిట్ మెంట్స్ చూస్తుంటే రెండు మూడేళ్ళు డేట్స్ అయితే దొరికేలా లేవు, మరి ఈ లోపు హరీష్ శంకర్ ఓ అద్బుతమైన కథ ని సిద్ధం చేసుకుని ఎన్టీఆర్ తో సినిమా ని ఓకే చేయించుకుంటాడేమో చూడాలి. ఇక వాల్మీకి సినిమా ఈ నెల 20 న భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.