ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త సినిమా లు వాల్మీకి మరియు డబ్ మూవీ బందోబస్త్ తెలుగు లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. వీటిలో ప్రస్తుతానికి బజ్ దృశ్యా క్రేజ్ దృశ్యా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏ సినిమా కి ఉన్నాయి అంటే మాత్రం కచ్చితంగా వాల్మీకి సినిమా కే అని చెప్పాలి. సూర్య తెలుగు డబ్ సినిమాలకు ఒకప్పుడు ఉన్నంత హడావుడి అయితే ఇప్పుడు లేదని చెప్పొచ్చు.
ఆ ఇంపాక్ట్ ఇప్పుడు బందోబస్త్ సినిమాపై స్పష్టంగా కనిపిస్తున్నా ఎక్కడో ఆశ… కేవీ ఆనంద్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అవ్వడం తో ఈ సారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని అంతా ఆశపడుతున్నారు. కాగా రీసెంట్ గా ఈ రెండు సినిమాల నైజాం థియేటర్స్ లిస్టు ను రిలీజ్ చేశారు.
అవి ఫైనల్ కాకున్నా కానీ బందోబస్త్ కి 200 థియేటర్స్ ని వాల్మీకి కి 90 థియేటర్స్ మాత్రమె ఇనీషియల్ గా రిలీజ్ చేసిన థియేటర్స్ లో ఉండటం తో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో అందరూ ఫైర్ అయ్యారు. తెలుగు సినిమా కి కాకుండా డబ్బింగ్ సినిమా కి అన్ని థియేటర్స్ ఏంటి అంటూ కొద్దిగా గట్టిగానే విమర్శించారు.
కట్ చేస్తే ఇప్పుడు రిలీజ్ కి మరో రోజు టైం మాత్రమె ఉండగా ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయి ఇప్పుడు వాల్మీకి కి 195 థియేటర్స్ అలాగే బందోబస్త్ కి 140 థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు యాడ్ ఇచ్చారు. కాగా ఫైనల్ కౌంట్ గా వాల్మీకి కి 230 వరకు థియేటర్స్ నైజాం లో దొరుకుతున్నయట.
ఇక సూర్య బందోబస్త్ కి ఫైనల్ గా 180 నుండి 190 వరకు థియేటర్స్ దొరుకుతాయని సమాచారం. మొత్తం మీద ఈ సినిమాలకు వచ్చే టాక్ ని బట్టి థియేటర్స్ ని అడ్జస్ట్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ రెండు సినిమాల్లో ఈ వారం బాక్స్ ఆఫీస్ విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.