బ్రిటిష్ వారి పై పోరాటం చేసిన మొట్ట మొదటి ఇండియన్ గా పేరు తెచ్చు కున్న ఉయ్యాల వాడ నర సింహా రెడ్డి జీవిత కథ గా తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ సైరా నర సింహా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 లాంటి సెన్సేషనల్ కంబ్యాక్ తర్వాత రెండున్నర ఏళ్ళు కష్టపడి చేసిన ఈ సెన్సేషనల్ మూవీ అక్టోబర్ 2 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవు తున్న విషయం తెలిసిందే.
రిలీజ్ కి 10 రోజులు సమయం లేని ఈ సినిమా పై ఇప్పుడు బయట పెద్ద రచ్చ జరుగుతుంది, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారి 5 వ తరం వారసులు సైరా టీం తమను మోసం చేసింది అంటూ యూనిట్ పై కేసు వేశారట. ఆ విషయాన్ని టీవీ 9 లో చెబుతున్నారు.
సినిమా నిర్మాత అయిన రామ్ చరణ్ తమ కుటుంబంలో ఉన్న 23 మందికి న్యాయం చేస్తామని, తమ ఆస్తులను సినిమా షూటింగ్ కోసం వాడుకున్నారని, కథ వివరాలను తమ నుండి సేకరించారని, ఇప్పుడు ఆదుకోకుండా ఉండిపోయారని వారు చెబుతున్నారు. అంతే కాకుండా ఒక్కొక్కరికి 2 కోట్ల చొప్పున మొత్తం 50 కోట్లు ఇస్తామని
అన్నారని అలాగే కథ కి 2 కోట్లు ఇస్తామన్నారని కానీ ఇప్పుడు ఓ 25 వేల చెక్ ఇచ్చారని వారి కంప్లైంట్ లో ఉందని అంటున్నారు, అవన్నీ క్లియర్ చేయించకుంటే సినిమా ను రిలీజ్ చేయనివ్వమని కూడా చెబుతున్నారు. కానీ సినిమాకి పని చేసిన వారికి ఒక్కొక్కరి 2 కోట్లు ఇస్తామని రామ్ చరణ్ అన్నాడని చెప్పడంలో…
పెద్దగా నిజాలు కనబడటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. నటీనటుల రెమ్యునరేషన్స్ కే కోట్లు దాటవని, 23 మందికి ఒక్కొక్కరికీ 2 కోట్లు ఇవ్వడం అనేది విచిత్రంగా ఉందని అంటున్నారు. మరి ఈ రచ్చ ఇప్పుడు సినిమా కి కొంత ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నా త్వరలోనే సమస్య ఓ కొలిక్కి వస్తుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.