మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో అడుగు పెట్టగా సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తొ రన్ అవుతుంది, కాగా సినిమా అన్ని భాషల కలెక్షన్స్ ని ఓవరాల్ గా చూసుకుంటే అంచనాలను పూర్తిగా అందుకోలేదు కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా అద్బుతమైన కలెక్షన్స్ నే వసూల్ చేసింది. కానీ ఓవరాల్ గా బిజినెస్ అండ్ టార్గెట్ ని చూసుకుంటే…
రెండు రాష్ట్రాలలో సాధించిన రికార్డ్ కలెక్షన్స్ మొత్తం మీద టార్గెట్ మొత్తాన్ని రికవరీ చేసే విధంగా లేక పోవడం తో తక్కువగా అనిపిస్తున్నాయి. సినిమా నైజాం ఏరియా లో 32 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాయలసీమ ఏరియాలో కూడా అద్బుతం సృష్టించింది.
టాలీవుడ్ చరిత్రలో బాహుబలి సిరీస్ కాకుండా అక్కడ నాన్ బాహుబలి రికార్డులు కొట్టిన రంగస్థలం 17.7 కోట్ల షేర్ ని దాటి 18 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా ఇప్పుడు 19 కోట్ల కి చేరువ అయ్యింది. 18 రోజుల్లో 18.85 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సైరా సినిమా కుదిరితే ఆదివారం సాధించే కలెక్షన్స్ తో…
లేకపోతె సోమవారం కలెక్షన్స్ తో ఓవరాల్ గా సీడెడ్ లో 19 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టబోతుంది. ఈ మార్క్ ని బాహుబలి సిరీస్ తప్పితే అందుకున్న ఏకైక నాన్ బాహుబలి మూవీ గా సైరా చరిత్ర లో చోటు ని సొంతం చేసుకోబోతుంది. కానీ బిజినెస్ ని పూర్తిగా దాటే అవకాశం అయితే తక్కువే అంటున్నారు.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి ఈ ఆదివారం చివరి పెద్ద రోజు గా చెప్పుకుంటున్నారు.. వచ్చే వారం దీపావళి డబ్బింగ్ సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ కానున్నాయి కాబట్టి ఓవరాల్ గా సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ దక్కే చాన్స్ తక్కువ అంటున్నారు. అయినా కానీ చరిత్రలో మూడో సినిమాగా ఇక్కడ నిలిచిపోబోతుంది సైరా సినిమా.