2016 కి ముందు వరుస పరాజయాలతో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ్ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ తెలుగు రీమేక్ ధృవ తో సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు… డీమానిటైజేషన్ సమయం లో కూడా అద్బుతమైన కలెక్షన్స్ ని అందుకోగా తర్వాత చేసిన రంగస్థలం తో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీశాడు రామ్ చరణ్, ఇక తర్వాత చేసిన వినయ విదేయ రామ భారీ గా నిరాశ పరిచింది.
ఇప్పుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ తో ఫుల్ బిజీ గా రామ్ చరణ్ మరో పక్క నిర్మాతగా 2017 లో ఖైదీ నంబర్ 150 ను ఈ ఇయర్ సైరా సినిమా ను ప్రొడ్యూస్ చేశాడు. ఇక ఇప్పుడు కొరటాల తో చిరు అప్ కమింగ్ మూవీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
ఈ సమయం లో ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ అఫీషియల్ గా ఏ సినిమా కమిట్ కాలేదు… దాంతో అప్ కమింగ్ మూవీ ఏది అయి ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా రామ్ చరణ్ కళ్ళు రీసెంట్ గా తమిళ్ లో సెన్సేషనల్ హిట్ అయిన ధనుష్ సినిమా పై పడింది.
ధనుష్ వెట్రిమారన్ కాంబో లో వాడా చెన్నై సూపర్ హిట్ తర్వాత వచ్చిన అసురన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా ని చూసి ఇష్టపడ్డ రామ్ చరణ్ రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికిప్పుడు కాకున్నా…
ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తీ అయిన తర్వాత ఈ సినిమా రీమేక్ కి కమిట్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది, ఆర్.ఆర్.ఆర్ తర్వాత సేఫ్ జోన్ లో ఉండాలి అంటే రీమేక్ బెటర్ ఆప్షన్ అనే చెప్పాలి. ధృవ లా సరిగ్గా కేర్ తీసుకుంటే మంచి విజయం సాధించవచ్చు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తేలాల్సి ఉంది.