బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలు టాక్ కి పూర్తీ విరుద్దమైన కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ బరిలో కలెక్ట్ చేసి అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇస్తూ ఉంటాయి. లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ సినిమా కూడా ఇలాంటి షాక్ నే ఇస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకున్నా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసి నెగటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్లకి షాక్ ఇచ్చింది.
ఆ సినిమానే అక్షయ్ కుమార్ రితేష్ దేశ్ ముక్ మరియు బాబీ డియోల్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ హౌస్ ఫుల్ 4. దీపావళి టైం లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో కే ఫ్లాఫ్ టాక్ రాగా సినిమా భారీ డిసాస్టర్ అవుతుంది అని అంతా అనుకున్నా…..
సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ఏమాత్రం తగ్గకుండా టార్గెట్ 185 కోట్లను అధిగమించి ఇప్పుడు 202 కోట్లతో సూపర్ హిట్ అనిపించుకుంది, దాంతో సినిమా కి నెగటివ్ రివ్యూ లు ఇచ్చిన వాళ్లకి షాక్ కొట్టగా ఇప్పుడు వాళ్ళు కొత్త వాదన తెరలేపారు. సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ రచ్చ చేస్తున్నారు.
మొదటి రోజు నుండే సినిమా కలెక్షన్స్ ని నిర్మాతలు ఫేక్ చేస్తూ వస్తున్నారని, అలా చేసే ఇప్పుడు సినిమా ను హిట్ లా మార్చారని వాదిస్తున్నారు. కచ్చితంగా సినిమా కలెక్షన్స్ లో 25 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో ఫేక్ కలెక్షన్స్ ని యాడ్ చేశారని వారు చెబుతున్నారు.
సినిమాను సపోర్ట్ చేసే వాళ్ళు కొందరు అలా చూసుకున్నా ఫేక్ కలెక్షన్స్ ని పక్కకు పెట్టినా సినిమా 175 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి ఆల్ మోస్ట్ హిట్ అయినట్లే కదా అంటూ వాదిస్తున్నారు. ఇందులో ఏది నిజమో ఒక్క నిర్మాతకు తప్ప వేరే వాళ్లకి తెలిసే అవకాశం తక్కువే అంటున్నారు విశ్లేషకులు…