విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీ స్టారర్ వెంకీ మామ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు రిలీజ్ అయింది, సినిమా వరల్డ్ వైడ్ గా 33.10 కోట్ల బిజినెస్ ని అందుకుని సుమారు 1000 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షో లను పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ లభిస్తుంది అన్నది ఆసక్తి కరంగా మారింది.
సినిమా స్టొరీ పాయింట్ ని ఫుల్ గా రివీల్ చేయకున్నా చిన్నప్పుడే తన తల్లి తండ్రులను కోల్పోయిన చైతన్య కి అన్నీ తానై పెంచుతాడు వెంకీ, అలాంటిది వెంకీ కి చెప్పకుండా ఆర్మీ లో జాయిన్ అవుతాడు నాగ చైతన్య, అలా ఎందుకు చేశాడు, తర్వాత ఏం అయింది అన్నది కథ అంటున్నారు.
సినిమా కథ పాయింట్ ఇది సెకెండ్ ఆఫ్ కి సంభందించి అయినా ఫస్టాఫ్ మొత్తం ఎంటర్ టైన్ మెంట్ వే లో మామా అల్లుళ్ళ బాండింగ్ ని డైరెక్టర్ చాలా బాగా చూపెట్టాడని అంటున్నారు. ముఖ్యంగా వెంకీ రోల్ బాగా ఎలివేట్ అవుతుందని, కానీ నాగ చైతన్య రోల్ కి…
మరీ అంత స్కోప్ లేదని అంటున్నారు. హీరోయిన్స్ కూడా ఉన్నంతలో ఆకట్టుకోగా కామెడీ సీన్స్ కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయని, కానీ యాక్షన్ సీన్స్ అండ్ 2 మాస్ సాంగ్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో దుమ్ము లేపడాని అంటున్నారు.
సెకెండ్ ఆఫ్ లో ఆర్మీ ఎపిసోడ్ మరీ అంత పకడ్బందీగా లేక పోవడం, అలాగే తర్వాత సెంటి మెంట్ సీన్స్ కూడా మరీ డ్రమాటిక్ గా ఉండటం, సెకెండ్ ఆఫ్ స్లో నరేషన్ ఎక్కువగా ఉండటం లాంటివి కొంచం ఇబ్బంది పెట్టినా మొత్తం మీద సినిమా ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు.
ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అన్నీ ఆకట్టుకున్నాయని, సినిమా మొత్తం మీద వెంకీ ఫ్యాన్స్ కి ఫుల్ సాటిస్ ఫై చేస్తుందని కానీ నాగ చైతన్య ఫ్యాన్స్ కి కొంచం వరకు మాత్రమె సాటిస్ ఫై చేస్తుందని, ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ మనసు గెలుచుకుంటుంది అని అంటున్నారు.
సినిమా కి ఫైనల్ గా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి వినిపిస్తున్న టాక్ ఎబో యావరేజ్ నుండి హిట్ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. సెకెండ్ ఆఫ్ కొంచం బెటర్ గా డీల్ చేసి ఉంటె బొమ్మ టాక్ బ్లాక్ బస్టర్ నుండి మొదలు అయ్యేదని అంటున్నారు. ఇక రెగ్యులర్ షోలకు సినిమా కి ఎలాంటి టాక్ లభిస్తుందో చూడాలి.