బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో అన్ సీజన్ లో కూడా జోరు చూపి అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించింది వెంకి మామ సినిమా. మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 21.56 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసిన సినిమా ఇప్పుడు సాలిడ్ వీకెండ్ తర్వాత తొలి వర్కింగ్ డే టెస్ట్ ను సోమవారం ఎదురుకుంది అని చెప్పొచ్చు.
కాగా వర్కింగ్ డే అవ్వడం తో హాలిడే తో పోల్చితే డ్రాప్స్ 4 వ రోజు గట్టిగానే కనిపించాయి. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో ఓవరాల్ గా 40% టు 50% లోపు డ్రాప్స్ ని ఎదురుకుంది ఈ సినిమా. కొన్ని సెంటర్స్ లో బెటర్ ఆక్యుపెన్సీ ఉన్నా ఓవరాల్ గా డ్రాప్స్ ఈ రేంజ్ లో ఉన్నాయి.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లి మెల్లి గా పుంజుకుంటూ ఉండగా సినిమా కచ్చితంగా బెటర్ గ్రోత్ నే చూపే అవకాశం ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న 50% లోపు డ్రాప్స్ ని బట్టి చూస్తె సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.6 కోట్ల నుండి…
2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉంది. కానీ వర్కింగ్ డే ని హోల్డ్ చేసి టెస్ట్ ని పాస్ అవ్వాలి అంటే మినిమం 3 కోట్ల రేంజ్ లో సినిమా కలెక్షన్స్ ని 4 వ రోజు అందుకోవాల్సి ఉంటుంది, అంతకుమించి కలెక్ట్ చేస్తే సాలిడ్ హోల్డ్ అనే చెప్పాలి. మరి మొత్తం మీద రోజు ముగిసే సరికి…
సినిమా ఎంతవరకు హోల్డ్ చేసి ఈ లెక్కని దాటుతుందో లేదో అన్నది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ తిరిగి భారీ ఎత్తున థియేటర్స్ కి రావడం పై ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి. మరి డే ఎండ్ కల్లా సినిమా స్టేటస్ ఎలా ఉందో మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం…