Home న్యూస్ రూలర్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

రూలర్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

      నట సింహం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ డిసాస్టర్ నుండి మేలుకుని కంప్లీట్ మేక్ ఓవర్ తో టోని స్టార్క్ లుక్ తో కనిపించి ఒక్కసారి గా హైప్ పెంచిన సినిమా రూలర్. తనకి జై సింహా తో హిట్ ఇచ్చిన కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ విషయానికి వస్తే…సాఫ్ట్ వేర్ సీఈఓ అయిన హీరో కి అనుకోకుండా కొందరి తో కంపెనీ విషయంలో గొడవ జరుగుతుంది, ఒకసారి హీరో పై విలన్స్ అటాక్ చేయగా అక్కడ జనాలు తనని మరో పేరు తో పిలుస్తారు. అసలు ఇంతకి ఆ వ్యక్తీకి సాఫ్ట్ వేర్ అయిన హీరో కి సంభందం ఏంటి అనేది అసలు కథ.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాలయ్య ఈ ఏజ్ లో కూడా అల్టిమేట్ ఎనర్జీ తో కుమ్మేశాడు, ఆయన ఎనర్జీ ముందు కుర్ర హీరోలు కూడా పనికిరారు అనేంతగా డాన్సులు చేసి దుమ్ము లేపారు, దానికి తోడూ బరువు తగ్గడం, కొత్త లుక్ ని ట్రై చేయడం తో బాలయ్య మరింత మెప్పించాడు.

కానీ అదే సమయం లో సెకెండ్ ఆఫ్ లో వచ్చే పోలిస్ గెటప్ కానీ ఆ లుక్స్ కానీ అంతే మైనస్ గా మారాయి. హీరోయిన్స్ ఉన్నంతలో ఆకట్టుకోగా అటు గ్లామర్ విషయం లో సోనాల్ చౌహాన్ ఆకట్టుకోగా కొద్దిగా నటనతో భూమిక,వేదిక మెప్పిస్తారు. మిగిలిన నటీనటులు ఉన్నంతలో ఆకట్టుకున్నారు.

ఇక సంగీతం సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి, దాంతో పాటు ఫైట్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కుమ్మేసింది, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో ఉంటుంది, ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నాసిరకంగా ఉందని చెప్పాలి. సెకెండ్ ఆఫ్ చాలా సీన్స్ డ్రాగ్ అవుతాయి.

సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఎప్పుడో మనం చూసి చూసి విసుగు వచ్చిన స్టొరీ పాయింట్ ని బాలయ్య డిఫెరెంట్ లుక్ తో కవర్ చేసి తెరకెక్కించాడు డైరెక్టర్ కే ఎస్ రవికుమార్. ఉన్నంతలో ఫస్టాఫ్ వరకు బాగా డైరెక్ట్ చేసినా..

సెకెండ్ ఆఫ్ పరమ రొటీన్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఓ చిన్న ట్విస్ట్ ఆ తర్వాత రొటీన్ క్లైమాక్స్ తో ఫస్టాఫ్ ఇచ్చిన ఇంప్రెషన్ ని నిలబెట్టుకోలేదు. ఉన్నంతలో బాలయ్య సినిమా కోసం పడ్డ కష్టం చూసి పర్వాలేదు అనిపిస్తుంది సెకెండ్ ఆఫ్…

మొత్తం మీద ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే… బాలయ్యే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, సెకెండ్ ఆఫ్ బాలయ్య లుక్స్ మైనస్ పాయింట్, సాంగ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లస్ పాయింట్స్ అవుతాయి. ఇక నెగటివ్ పాయింట్స్ విషయం లో ఫ్లాష్ బ్యాక్, సెకెండ్ ఆఫ్, డైరెక్షన్ మేజర్ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి.

ఉన్నంతలో బాలయ్య కోసం ఒకసారి చూడొచ్చు తప్పితే సినిమా లో కొత్తదనం ఏమి ఉండదు, బాలయ్య మాస్ ఫాన్స్ కి నచ్చే అవకాశం ఉంది, రెగ్యులర్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారో చెప్పలేం. బాలయ్య కష్టం చూసి సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ [2.5 స్టార్స్]….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here