ఈ ఇయర్ స్టార్టింగ్ లో దేవ్ టి డిసాస్టర్ కొట్టినా దీపావళి కి ఖైదీ తో సైలెంట్ బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ దొంగ బాక్స్ ఆఫీస్ దగ్గర లేటెస్ట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు లో భారీ పోటి నడుమ రిలీజ్ అవ్వడం తో చాలా సైలెంట్ గా రిలీజ్ అయింది, మరి సినిమా టాక్ ఏంటో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే ఒక పొలిటికల్ లీడర్ కి ఒక కుమార్తె ఒక కొడుకు, చిన్నప్పుడే ఒక గొడవ కారణంగా కొడుకు ఇంట్లో నుండి వెళ్లి పోయి తిరిగి 15 ఏళ్ల కి ఇంటికి వస్తాడు, అసలు వచ్చింది నిజం కొడుకు అయినా కాదా, 15 ఏళ్ళు ఏం చేశాడు, తన పై విలన్స్ ఎందుకు అటాక్ చేస్తున్నారు, మధ్యలో జ్యోతిక రోల్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా స్టొరీ పాయింట్ చాలా చిన్నది కావడం తో సినిమా లెంత్ ఎక్కువ అయింది, కథ లోకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది, ఆ కథ ముందుకు వెళ్ళడానికి కూడా చాలా నెమ్మదిన స్క్రీన్ ప్లే తో నడవడం తో చూస్తున్న ఆడియన్స్ బోర్ ఫీల్ ఎక్కువ అవుతారు.
ఉన్నంతలో కార్తీ డిఫెరెంట్ గెటప్స్ అండ్ నటనతో ఆకట్టుకోగా జ్యోతిక కూడా మెప్పిస్తుంది, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వీక్ గా ఉన్నాయి. మరీ ఖైదీ రేంజ్ లో అంచనాలను అందుకుందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. ఉన్నంతలో కొన్ని ఫైట్ సీన్స్, కొన్ని కామిక్ సీన్స్ కొన్ని సెంటిమెంట్ సీన్స్ బాగుంటాయి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీ పోటి లో రిలీజ్ అవ్వడం తో రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 100 థియేటర్స్ నే సొంతం చేసుకుంది, 3.5 కోట్ల బిజినెస్ ని సాధించిన సినిమా తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 4 కోట్లు కలెక్ట్ చేయాలి.
ఇక మొదటి రోజు సినిమా భారీ పోటి వలన మహా అయితే 20 నుండి 25 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్న దానిపై లాంగ్ రన్ ఆధార పడి ఉంటుంది.