బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఈ ఇయర్ మొదట్లో 3 స్టార్ రేటింగ్ తో రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు అట్టర్ ఫ్లాఫ్ అయింది, ఇప్పుడు పర్వాలేదు బాగుంది అన్న టాక్ వచ్చిన రూలర్ కలెక్షన్స్ కోసం కష్టపడుతుంది.
సినిమా రెండు రోజుల్లో అంచనాలను అందుకోలేని కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మూడో రోజు ఆదివారం అయినా కానీ ఎక్కడా పెద్దగా గ్రోత్ కనిపించనే లేదు, సినిమా ఉన్నంతలో సీడెడ్ ఏరియా తప్పితే మిగిలిన ఏరియాల్లో బిలో యావరేజ్ కలెక్షన్స్ తో నే సరిపెట్టింది.
ముఖ్యంగా నైజాం వైజాగ్ లాంటి ఏరియాల్లో అసలు కనీస ఓపెనింగ్స్ కూడా సినిమా సొంతం చేసుకోలేదు, మొత్తం మీద సినిమా రెండో రోజు తో పోల్చితే 30% టు 35% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో 5% లోపు గ్రోత్ ని మాత్రమె అందుకుంది.
దాంతో మొత్తం మీద ఇప్పుడు రూలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 90 లక్షల నుండి 1 కోటి లోపు షేర్ అందుకోవచ్చట.
ఓవరాల్ గా చూసుకుంటే సినిమా బిజినెస్ ని అందుకోవడానికి ఇవి ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని ఇప్పుడు 7.5 కోట్ల రేంజ్ లో ముగించబోతుంది రూలర్ సినిమా. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏవైనా అద్బుతాలు జరిగితే తప్ప ఈ మార్క్ నే సినిమా అందుకోబోతుంది.