నట సింహం బాలయ్య నటించిన రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం తెగ కష్టపడుతుంది కానీ జనాలు భారీ సంఖ్యలో థియేటర్స్ కి రావడం లేదు, దాంతో వైజాగ్ తో పాటు కొన్ని మెయిన్ సెంటర్స్ లో సినిమా ను పెర్సేంటేజ్ బేస్ మీద ఆడిస్తున్నారు.
అంటే థియేటర్స్ రెంట్స్ సరిపడా కలెక్షన్స్ వచ్చాక మిగిలిన మొత్తం బయ్యర్లు థియేటర్స్ ఓనర్లు పంచుకుంటారు. ఇలాంటి పరిస్థితి పెద్ద సినిమాలను రెండు మూడు వారాల తర్వాత వస్తుంది కానీ రూలర్ కి రిలీజ్ అయిన 4, 5 వ రోజు నుండే మొదలు అయింది.
ఇక సినిమా 5 వ రోజు క్రిస్టమస్ హాలిడేస్ మొదలు అయినా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో పెద్దగా గ్రోత్ ని సాధించలేక పోయింది, మొదటి 2 షోలకు 25% లోపు డ్రాప్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కేవలం 5% మే గ్రోత్ ని అందుకుంది.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు డ్రాప్స్ ని గమనిస్తే 30 లక్షల షేర్ ని అందుకునే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. దాంతో సినిమా తేరుకుంటుంది అనుకున్నవాళ్ళకి గట్టి షాకే ఇచ్చింది రూలర్.
ఇక లేట్ నైట్ షోలలో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇంతకిమించి ముందు వెళ్ళడం కష్టమే అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5 వ రోజు 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చట. ఓవర్సీస్ లో క్రిస్టమస్ హాలిడేస్ మొదలు అయినా రూలర్ కి పెద్ద అడ్వాంటేజ్ ఏమి దక్కలేదు. ఇక 5 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.