కెరీర్ స్టార్టింగ్ లో వరుస పెట్టి విజయాలను అందుకుని హాట్రిక్ హిట్స్ హీరోగా పేరు తెచ్చుకుని యూత్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న రాజ్ తర్వాత తర్వాత ట్రాక్ తప్పాడు. ఒకటి తర్వాత ఒకటి ఆడియన్స్ కి నచ్చని కథలను చేస్తూ వరుస పరాజయాలను తన ఖాతాలో వేసుకుని ఇప్పుడు మినిమమ్ ఓపెనింగ్స్ కి కూడా దూరం అయిన టైం లో ఇప్పుడు ఇద్దరి లోకం ఒకటే అంటూ లవ్ స్టొరీ తో వచ్చాడు.
మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ. కథ పాయింట్ కి వస్తే చిన్నప్పుడే కలిసి మెలసి తిరిగిన హీరో హీరోయిన్స్ తర్వాత దూరం అయ్యి… పెద్దయ్యాక ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అవుతారు, శాలిని పాండే కి హిరోయిన్ అవ్వాలని కోరిక, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగని టైం లో…
ఫోటో గ్రాఫర్ అయిన రాజ్ తరుణ్ తీసిన ఫోటో ల వల్ల హిరోయిన్ అవకాశం వస్తుంది, తర్వాత వీరి లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటి…. తర్వాత కథ ఎలాంటి టర్న్ తీసుకుంది అన్నది మిగిలిన కథ. చిన్నప్పుడే విడిపోవడం తర్వాత పెరిగాక కలుసుకోవడం లాంటి కథలు ఎన్నో చూసి చూసి ఉన్నాం.
ఇందులో స్పెషల్ ఏంటి అనేది చెబితే మినిమమ్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి చెప్పడం లేదు కానీ ఆ పాయింట్ ని ఇంట్రెస్ట్ గా చివరి 20 నిమిషాల్లో చెప్పి మిగిలిన సినిమా మొత్తం ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేలా తెరకెక్కించాడు డైరెక్టర్. రాజ్ తరుణ్ తన ప్లస్ పాయింట్ అయినా…
ఎనర్జీ ఉన్న రోల్స్ కాకుండా ఇలా పూర్తీ సైలెంట్ అయిపోయే రోల్స్ ఎందుకు చేస్తున్నాడో తెలియదు కానీ ఈ సినిమాలో దానికి ఒక రీజన్ ఉన్నా తన పాత్ర ఏమాత్రం ఆసక్తిని కలిగించదు, హిరోయిన్ రోల్ కూడా బోర్ కొట్టిస్తుంది, మధ్య మద్య లో పాటలు కొంచం బానే ఉన్నా..
ఆడియన్స్ కనెక్ట్ కాలేరు, ఎలా గోలా ఫస్టాఫ్ వరకు ఓపిక పట్టి చూసి సెకెండ్ ఆఫ్ లో అయినా ఏమైనా కొత్తదనం ఉంటుంది అనుకుంటే చివరి 20 నిమిషాలు తప్ప మిగిలిన సినిమా మొత్తం చాలా స్లో నరేషన్ తో ఎలాంటి ఇంట్రెస్ట్ కలగకుండా ఎదో చూస్తున్నాం అంటే చూస్తున్నాం అనిపించేలా చేస్తుంది సినిమా.
ఉన్నంతలో రాజ్ తరుణ్ అండ్ శాలిని పాండేల కెమిస్ట్రీ, ఒకటి 2 పాటలు… చివరి 20 నిమిషాల ఎపిసోడ్ కొంచం హార్ట్ టచింగ్ గా ఉండటం తప్పితే మొత్తం మీద సినిమాలో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ ఏమి ఉండదు, సినిమాలో హిరోయిన్ పాత్ర తన ఎక్స్ లవర్ కి ఒక మాట చెబుతుంది.
నీతో కలిసి ఉన్న మన లవ్ స్టొరీ లో ఫీల్ అయ్యే పాయింట్ ఒక్కటి లేదు, లేనప్పుడు మనది లవ్ కానట్లే అని, సినిమా కంప్లీట్ అయ్యాక ఆడియన్స్ కూడా ఏం కనెక్ట్ కాలేక పోతారు. ఇలాంటి కథని దిల్ రాజు ఎలా నమ్మాడో ఆయనకే తెలియాలి, మొత్తం మీద రొటీన్ మూవీస్ చూసేవాళ్ళు కూడా…
ఈ సినిమాను భరించడం కష్టమే….రీసెంట్ టైం లో అన్ని సినిమాలు చూసేసి ఇప్పుడు ఏం సినిమా చూద్దాం అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఈ సినిమా కి వెళ్ళొచ్చు. సినిమా కి ఫైనల్ గా మా రేటింగ్ [2 స్టార్స్]…. రాజ్ తరుణ్ ఖాతాలో మరోటి పడినట్లే…